బాల‌య్య కోసం బాలీవుడ్ స్టార్‌?


బాల‌య్య, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో బాల‌య్య‌ను ఢీ కొట్టే పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ న‌టుడు సంజ‌య్ ద‌త్ న‌టించ‌బోతున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. బాల‌కృష్ణ సినిమాలో విల‌న్ అంటే ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇలాంటి పాత్ర‌లో సంజ‌య్ ద‌త్‌ను న‌టింప చేస్తే ఎఫెక్టివ్‌గా ఉంటుంద‌ని బోయ‌పాటి భావించి, మున్నాభాయ్‌ని లైన్‌లో పెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ని టాక్‌. మ‌రి సంజ‌య్ ద‌త్ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాడో లేదో చూడాలి. కాగా.. ఇప్పుడు బాల‌కృష్ణ త‌న 105వ చిత్రం `రూల‌ర్‌` చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు.