Bunny NTR: “బాహుబలి” దెబ్బతో తెలుగు సినిమా రంగం స్థాయికి పెరిగిన సంగతి తెలిసిందే. ఏకంగా దేశ ప్రధాని మోడీ ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి గొప్పగా వ్యాఖ్యానించారు. ఇక ఇదే సమయంలో తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలను ఇతర ఇండస్ట్రీలకు చెందిన టాప్ హీరోలు.. రీమేక్ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో తెలుగు డైరెక్టర్ ల తో పాటు హీరోలతో సినిమాలు చేయడానికి టాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన టాప్ మోస్ట్ నటీనటులు పోటీపడుతూ ఉన్న పరిస్థితి.
ఇదిలా ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో… ఎన్టీఆర్, బన్నీ హీరోలపై ప్రశంసల వర్షం కురిపించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని అదేవిధంగా దక్షిణాది హీరోల్లో ఎవరితో నటించాలని… ప్రశ్నించగా… ఎన్టీఆర్, బన్నీ అనీ స్పష్టం చేయడం జరిగింది. ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం వస్తే.. ఎగిరి గంతేస్తారు అని తెలిపింది. ఎన్టీఆర్ పర్సనాలిటీ అందరి కంటే డిఫరెంట్ అని పేర్కొంది. ఇదే సమయంలో ఎవరితో పనిచేయాలనుకుంటున్నారు? అని ప్రశ్నించగా, రాజమౌళి, అయాన్ ముఖర్జీల పేర్లు చెప్పింది.
దీపిక పదుకొణే నటించిన ‘గెహరాయియా’ చిత్రం ఇటీవల రిలీజ్ కావడంతో… ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో దీపికాపదుకునే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ కి అదేవిధంగా పుష్ప సినిమాతో బన్నీకి జాతీయ మీడియా మంచి వెయిటేజీ ఇవ్వడం జరిగింది. ఇటువంటి తరుణంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక దీపికాపదుకునే మాత్రమే కాక చాలా మంది హీరోయిన్లు… టాలీవుడ్ నటీనటులతో చేయడానికి ఇష్టపడుతున్నారు.