దివంగత తార శ్రీదేవి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ హిందీలో దఢక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు హిందీ సినిమాల్లోనే నటిస్తోంది. అయితే జాన్వీ దక్షిణాది సినిమాలను చిన్నచూపు చూస్తుందని.. మహేశ్, రామ్‌చరణ్ వంటి స్టార్స్‌తో పాటు అప్ కమింగ్ స్టార్ విజయ్ దేవరకొండ వంటి హీరో సినిమాలోనూ ఆమె నటించడానికి అంగీకరించలేదంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో ఈ వార్తలకు చెక్ పెట్టడానికి ఆమె తండ్రి బోనీ సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఆయన అధికారిక ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. శ్రీదేవి దక్షిణాది సినిమాల్లోనే ఎక్కువగా నటించిందని, దక్షిణాది తారలతో ఆమెకు మంచి అనుబంధం ఉందని, అలాగే జాన్వీ కూడా దక్షిణాది సినిమాలను ఇష్టపడుతుందని, తప్పకుండా మంచి స్క్రిప్ట్ వస్తే దక్షిణాది స్టార్లతో నటించడానికి ఆమె సిద్ధమని తెలియజేస్తూ రూమర్స్‌కు చెక్ పెట్టారు.
previous post
next post