Boney Kapoor Sridevi: భారతీయ చలనచిత్ర రంగంలో దివంగత హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా రాణించటం జరిగింది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో వందలాది సినిమాలలో నటించింది. అందము మరియు అభినయం నటనతో టాప్ హీరోయిన్ గా రాణించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రామారావు తరంతో పాటు ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో కూడా సినిమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత 1996లో బాలీవుడ్ నిర్మాత బోణి కపూర్ నీ పెళ్ళాడి ఇద్దరు పిల్లలకు జన్మ నిచ్చి సినిమాలకు దూరమయింది. ఆ తర్వాత 2012లో “ఇంగ్లీష్ వింగ్లీష్” సినిమా ద్వారా.. రియంట్రి ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేస్తూ కూతురు జాహ్నవి కపూర్ చేత సినిమా ఎంట్రీ ఇప్పించింది.
అయితే కూతురు మొదటి సినిమా విడుదల కాకముందే 2018 ఫిబ్రవరి నెలలో మరణించడం జరిగింది. శ్రీదేవి మరణించి ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత తాజాగా.. ఆమె మరణం పై బోణి కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2018 దుబాయ్ లోని ఓ హోటల్ బాత్ టబ్ లో శ్రీదేవి అనుమానస్పదంగా మరణించింది. అయితే తన భార్య సహజంగా మరణించలేదని.. ప్రమాదవశాత్తు మరణించిందని చెప్పుకొచ్చారు. భారత మీడియా సంస్థలు ఒత్తిడి మేరకు ఈ కేసులో దుబాయ్ పోలీసులు అనేక కోణాల్లో తనను విచారించారని పేర్కొన్నారు. పోలీసులు తనను రెండు రోజులు సుదీర్ఘంగా విచారించారని లై డిటెక్టర్ టెస్టులు కూడా చేశారన్నారు.
లోతుగా విచారణ చేసిన తర్వాత ఈ కేసులో తనకు దుబాయ్ పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వటం జరిగిందని స్పష్టం చేశారు. ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడి నీటిలో మునగటం కారణంగానే శ్రీదేవి చనిపోయిందని పేర్కొన్నారు. శ్రీదేవికి లో బీపీ ఉందని.. అందుకే కఠినమైన డైట్ ఫాలో అయ్యేది అని బోణి కపూర్ స్పష్టం చేశారు. ఓసారి సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో శ్రీదేవి ఇలానే పడిపోయింది అప్పుడు పన్ను విరిగింది అని చెప్పుకొచ్చారు.