త‌ప్పుడు ప్ర‌చారంపై బోనీ వార్నింగ్‌

దివంగ‌త తార శ్రీదేవి భ‌ర్త‌..ప్ర‌ముఖ నిర్మాత బోనీక‌పూర్‌, ప్ర‌స్తుతం త‌మిళంలో అజిత్‌తో `పింక్‌` సినిమాను `నేర్కొండ పార్వై` పేరుతో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈయ‌న అజిత్‌, హెచ్‌.వినోద్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు క్యాస్టింగ్ కాల్ అంటూ ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే దీనిపై బోనీ స్పందించారు. ఈయ‌న త‌మ సంస్థ ఎలాంటి క్యాస్టింగ్ కాల్ ఇవ్వ‌లేద‌ని, ఒక‌వేళ అలాంటి ప్ర‌క‌ట‌ను న‌మ్మి ఎవ‌రైనా మోస‌పోయుంటే త‌మ సంస్థ బాధ్య‌త వ‌హించ‌ద‌ని ప్ర‌క‌ట‌న‌ను జారీ చేశారు.