తెలుగువాడైన విక్రమ్ తమిళంలో స్టార్ హీరోగా వెలుగుతున్నాడు. అంతేకాదు విక్రమ్ సినిమాలన్ని ఎంత విభిన్నంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శివ పుత్రుడు, అపరిచితుడు, మల్లన్న, ఐ, ఇలా … ఏ సినిమా చేసిన అందులో విక్రం తనని తాను ఎంతగా మలుచుకుంటాడో అందరికి తెలిసిందే. అంతేకాదు ప్రయోగాలకి ఎప్పుడు సిద్దంగా ఉంటాడు విక్రమ్. ప్రత్యేకించి విక్రమ్ ఈ సినిమాలో అద్భుతంగా నటించడం చాలా కష్టం. అంత అద్భుతంగా ఉంటాయి ఈ హీరో చేసిన సినిమాలు.
ఇక విక్రమ్ తనయుడు దృవ్ కూడా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన సంగతి తెలిసిందే. గత సంవత్సరం దృవ్ తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మ ద్వారా కోలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే దృవ్ తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు. నటనలో తండ్రి లాగే ఎంతగానో శ్రమిస్తాడన్న పేరును ని మొదటి సినిమాతోనే సంపాదించుకున్నాడు.
ఇక తండ్రీ కొడుకులిద్దరు కలిసి భారీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. మాఫియా బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. లలిక్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నాడు. ఇక ఈ సినిమా విక్రమ్ కెరీర్ లో 60 సినిమాగా రూపొందుతుండగా ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!