బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ – రణబీర్ కపూర్ జంటగా రూపొందిన తాజా చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమాని ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో తెలుగులో విడుదల చేయడం జరిగింది. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాను రాజమౌళి సమర్పిస్తూ విడుదల చేశారు. మొన్న శుక్రవారం రిలీజైన ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినా సరే సినిమాకు వసూళ్ల వర్షం కురవడం కొసమెరుపు.
కథ విషయానికొస్తే… మనం పురాణాలలో, ఇతిహాసాలలో చదువుకున్న అస్త్రాలతో నేటి ఆధునిక సమాజానికి ముడిపెడుతూ ఒక కల్పిత కథ రాసుకున్న దర్శకుడు అయాన్ ముఖర్జీ దాన్ని అందంగా తెరకెక్కించడంలో సఫలమయ్యాడు. కథ కాస్త సాగదీత భావన కలిగినా ప్రేక్షకులు ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ కి ఫిదా అవుతున్నారు. దీంతో ఈ సినిమాకి వసూళ్ల వర్షం కురుస్తోంది. హిందీ వర్షన్ మొదటి రోజు ₹ 31.5 కోట్ల నెట్, రెండో రోజు ₹ 37.5 కోట్ల నెట్, మూడో రోజు ₹ 39.5 కోట్ల నెట్ సంపాదించింది.
ఇక దేశవ్యాప్తంగా మిగతా భాషలలో మొదటి రోజు ₹ 17.15 కోట్ల అంచనా, 2వ రోజు ₹ 20.73 కోట్ల అంచనా, 3వ రోజు ₹ 21.63 కోట్ల అంచనా మేర వసూలు అయ్యాయని అంటున్నారు. ఇక తెలుగులో కూడా ఈ సినిమా భారీ ఎత్తున వసూళ్ల వర్షం కురిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏకంగా మూడు రోజులకు గాను 20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించి మునుపెన్నడూ లేని విధంగా బాలీవుడ్ సినిమా తెలుగులో అత్యధిక కలెక్షన్లు సాధించినట్లయింది. ఇక NTR ముఖ్యఅతిథిగా జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గనుక జరిగి ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధించేది అనే ప్రచారం జరుగుతుంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!