NewsOrbit
సినిమా

‘బాయ్’ ట్రైలర్ లాంచ్

విశ్వరాజ్ క్రియేషన్స్ బ్యానర్‌పై అమర్ విశ్వరాజ్ దర్శకత్వం వహించి నిర్మిస్తోన్న చిత్రం ‘బాయ్’. ఆర్. రవి శంకర్ రాజు మరో నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో లక్ష్య, సాహితీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా సోమవారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మాస్టర్ విరాట్, ట్రైలర్‌ను నిర్మాత బెక్కం వేణుగోపాల్ విడుదల చేశారు. ఈ సందర్భంలోనే..

అతిథి బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ – “నాకు ప్యూర్ లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. అందుకే మా బ్యానర్‌లో `మేం వయసుకు వచ్చాం` సినిమా చేశాను. ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్ చూడగానే నాకు గూస్ బమ్స్ వచ్చాయి. ట్రైలర్‌ చూస్తుంటే వండర్‌ఫుల్ కంటెంట్ కనపడుతోంది. టెన్త్ క్లాస్‌లో ఉన్న ఏజ్ గ్రూప్ పిల్లలు ఏ రకమైన ఫీలింగ్స్‌తో ఉంటారో ఈ సినిమాలో చూపించినట్టు కనపడుతోంది. లీడ్ రోల్‌లో నటించిన పిల్లలు లక్ష్య, సాహితీ కూడా మెచ్యూర్డ్ లెవెల్ యాక్టింగ్ చేశారు. ముఖ్యంగా ఈ చిత్ర కాన్సెప్ట్ నచ్చి పివిఆర్ సినిమా వారు రైట్స్ తీసుకొని ఆగస్టు 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. అది నిజంగా ఆనందించాల్సిన విషయం. `బాయ్` టీమ్‌కు మంచి సక్సెస్ రావాలని ఆశిస్తున్నాను“ అన్నారు.

డార్లింగ్ స్వామి మాట్లాడుతూ – “అమర్ నాకు 10 సంవత్సరాలుగా పరిచయం కానీ ఈ సినిమాతో దర్శకుడు అయ్యాడని మాత్రం ఇప్పుడే తెలిసింది. ఆరు నెలలు పిల్లలతో కష్టపడి యాక్ట్ చేయించి ఈ సినిమాను తెరకెక్కించాడు. టెన్త్ క్లాస్‌లో ఉండే వారి ప్రేమ స్వచ్ఛంగానూ.. డేరింగ్‌గానూ ఉంటుంది. ఆ ఏజ్ గ్రూప్ వారి కాన్సెప్ట్‌తో ఈ సినిమా వస్తుంది. సినిమా పెద్ద సక్సెస్‌ను అందుకోవాలి“ అన్నారు.

సాహితీ మాట్లాడుతూ – “ముందుగా అవకాశం ఇచ్చిన దర్శకుడుకి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. `బాయ్` సినిమా ఒక బ్యూటీఫుల్ స్కూల్ లైఫ్ స్టోరీ. టెన్త్ క్లాస్ అబ్బాయికి మ్యాథమాటిక్స్ చాలా టఫ్. అలాంటి అబ్బాయికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయనేదే కథ సారాంశం. ఈ మూవీ వల్ల నాకు ఓ మంచి సక్సెస్ వస్తుందని భావిస్తున్నాను“ అన్నారు.

చిత్ర దర్శకుడు, నిర్మాత అమర్ విశ్వరాజ్ మాట్లాడుతూ – “ఈ చిత్ర కథ గురుంచి చెప్పాలంటే కాలేజ్ వైపు ఆశగా చూస్తున్న ఓ అబ్బాయి స్టోరీ. అందుకు టెన్త్ క్లాస్‌లో తను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనేది కథాంశం. ఇక ఈ సినిమాకు కెమెరామెన్ ఆసర్గ్ చాలా ఇన్వాల్వ్ అయ్యి పని చేశాడు. నిర్మాత రవిశంకర్ కూడా చాలా సపోర్ట్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది అంటున్నారు. సెన్సార్ వారు కూడా క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చారు. నేను ఈ సినిమా చేయడానికి కారణమైన ఇద్దరు ఏకలవ్య గురువులు ఉన్నారు వారి గురుంచి సక్సెస్ మీట్ లో చెబుతాను. ఈ ‘బాయ్’ చిత్రం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తగా విడదలకానుంది“ అన్నారు.

ఆర్. రవిశంకర్, మిర్చి మాధవి, కల్పలత లతో పాటు ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

లక్ష్య, సాహితీ, మాధవి, కల్పలత, నీరజ్, వినయ్ వర్మ, నేహల్, వర్ష, త్రిశూల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అస్కర్, ఎడిటర్: ఏకలవ్యన్, మ్యూజిక్: ఎల్విన్ జేమ్స్, జయ ప్రకాష్. జె. ఆడియోగ్రఫి: జె. రాఘవ చరణ్, సౌండ్ ఎఫెక్ట్స్: జె ఆర్. యత్రి రాజ్, కో ప్రొడ్యూసర్స్: శశిధర్ కొండూరు, ప్రదీప్ మునగపాటి, నిర్మాతలు:ఆర్. రవిశంకర్ రాజు, అమర్ విశ్వరాజ్, డైరెక్టర్: అమర్ విశ్వరాజ్,

author avatar
Siva Prasad

Related posts

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష బాధను వైదేహి అర్థం చేసుకుంటుందా లేదా.

siddhu

Pawan Kalyan: “ఖుషి” సెంటిమెంట్..తో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” టీజర్..!!

sekhar

Pushpa 2: భారీ ధరకు అల్లు అర్జున్ “పుష్ప-2” డిస్ట్రిబ్యూషన్ రైట్స్…?

sekhar

Kumkuma Puvvu April 17 2024 Episode 2157: యుగంధర్ ఆశ ని గుర్తుపడతాడా లేదా

siddhu

Guppedanta Manasu April 17 2024 Episode 1052: మహేంద్ర ఇచ్చిన షాకింగ్ న్యూస్ కి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Malli Nindu Jabili April 17 2024 Episode 625: అరవింద్ మాలిని కళ్యాణం చేయించడం నాకు ఇష్టం లేదు అని చెప్పిన వసుంధర…

siddhu

Ranneeti web Series Trailer: ఓటీటీ లోకి వచ్చేస్తున్న మరో థ్రిల్లర్ సిరీస్.. వైరల్ అవుతున్న ట్రైలర్..!

Saranya Koduri

Hanuman Telugu TV Premiere: టీవీ ఛానల్ లోకి వచ్చేస్తున్న హనుమాన్.. టెలికాస్ట్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 17 2024 Episode 213: పిల్లల బాధని విన్న అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 17 2024 Episode 340: రాధ తో గొడవ పడుతున్న రుక్మిణి…

siddhu

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Ranam OTT: ఓటీటీలోకి రానున్న నందితా శ్వేత మిస్టరీ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Tillu Square OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న టిల్లు గాడు.. అనుకున్న దానికంటే ముందుగానే స్ట్రీమింగ్..!

Saranya Koduri

Monkey Man OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న శోభిత ధూళిపాళ మూవీ.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Leave a Comment