సినిమా

Balayya Boyapati: బాలయ్యతో సీక్వెల్ ప్లాన్ చేసిన బోయపాటి..??

Share

Balayya Boyapati: వరస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణని రెండుసార్లు ఆదుకున్న డైరెక్టర్ గా బోయపాటికి నందమూరి అభిమానుల్లో మంచి పేరుంది. “లక్ష్మీ నరసింహ” వంటి హిట్ సినిమా తర్వాత బాలయ్య బాబు అనేక పరాజయాలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో సింహ సినిమా చేసి.. బాలయ్య ని సరి కొత్తగా చూపించి బ్లాక్ బస్టర్ హిట్ బోయపాటి తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత “లెజెండ్” తో మరో బ్లాక్ బస్టర్ బాలయ్యకు ఇవ్వడం జరిగింది. ఇక లెజెండ్ తర్వాత మళ్ళీ బాలయ్య వరుసపెట్టి ప్లాపులు ఎదుర్కొన్నాడు. ఆఖరికి ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించిన గాని హిట్ అందుకోలేదు.

boyapati legend sequel planing for balayya

దీంతో ఫుల్ డిజస్టార్ లలో ఉన్న బాలయ్యనీ “అఖండ”తో.. మళ్లీ ఫుల్ ఎనర్జీతో బ్లాక్ బస్టర్ ఇచ్చి బోయపాటి లేపడు. హ్యాట్రిక్ విజయం బాలయ్యతో సాధించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య బాబు వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. “అఖండ” తర్వాత గోపీచంద్ మలినేని ప్రాజెక్టు చేస్తున్న బాలయ్య ఆ తర్వాత అనిల్ రావిపూడి సినిమా చేయటానికి రెడీ అయ్యారు. అయితే ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత పొలిటికల్ నేపథ్యంలో బాలయ్య తో సినిమా చేయడానికి బోయపాటి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు వార్తలు ఇండస్ట్రీ లో వినపడుతున్నాయి.

 

అయితే ఈ కథ లేకపోతే “లెజెండ్” సీక్వెల్ బోయపాటి ప్లాన్ చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా.. 2024 ఎన్నికలకు ముందే బోయపాటితో బాలయ్య భారీ సినిమా చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం బాలయ్య బాబు గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి సినిమాలను చేస్తూ ఉన్నారు. ఇంకా బోయపాటి రామ్ పోతినేని తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ అయ్యాక బోయపాటి బాలకృష్ణ స్క్రిప్టుపై ఫోకస్ పెట్టనున్నట్లు టాక్.


Share

Related posts

Mega family: బాగా ముదురుతున్న ‘మెగా vs అల్లు’వారి ఫ్యాన్స్ గొడవలు.. వారిమధ్య కోల్డ్ వార్ నిజమేనా?

Ram

Nandamuri Family: బాబాయ్ అబ్బాయ్ హీరోలుగా అనిల్ రావిపూడి మరో మల్టీస్టారర్..!?

bharani jella

Editorial : ‘ కాశ్మీర్ ఫైల్స్ ‘ చూసి జిందాబాద్ లు కొడితేనే .. దేశభక్తులమా ??

siddhu
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar