Boyapati Srinu: టాలీవుడ్ ఇండస్ట్రీలో బోయపాటి శ్రీను మాస్ ఆడియన్స్ నీ అలరించే రీతిలో సినిమా చేస్తారన్న సంగతి తెలిసిందే. మాస్ పల్స్ తెలుసుకోవటంలో స్పెషలిస్ట్ డైరెక్టర్ బోయపాటి అని చాలామంది ఆయన సినిమాలు చూసి కామెంట్ చేస్తుంటారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బోయపాటి..బాలకృష్ణ “అఖండ”తో విజయం సాధించడంతో హీరో రామ్ పోతినేని తో… సినిమా చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగింది.
మాస్ కథాంశం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో రామ్ సరసన ఇండస్ట్రీ లక్కీ హీరోయిన్ నీ తీసుకోవడానికి బోయపాటి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె మరెవరో కాదు రష్మిక మందన. ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్టయిన సినిమాలలో చాలా వరకు రష్మిక నటించిన సినిమాలే అత్యధికం. కరోనా వైరస్ వచ్చిన 2 సంవత్సరాలలో సినిమాలు పెద్దగా రిలీజ్ కాకపోయినా గానీ… వైరస్ రాకముందు “సరిలేరు నీకెవ్వరు” ఆ తర్వాత “పుష్ప” వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తన ఖాతాలో వేసుకోవడం తో రష్మిక మందన ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.
ఈ నేపథ్యంలో డైరెక్టర్ బోయపాటి .. రామ్ పోతినేని తో చేయబోయే ప్రాజెక్టుల్లో రష్మిక మందన నీ హీరోయిన్ గా తీసుకోవడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీ టాక్. సినిమాలో రామ్ పోతినేని చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ లో… కనిపించనున్నట్లు హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేకంగా ఉండే రీతిలో స్క్రిప్ట్ రెడీ చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్.