Boyapati: టాలీవుడ్ మాస్ పల్స్ రేటు బాగా తెలిసిన ఎక్స్పెక్ట్ డైరెక్టర్ గా పేరొందిన దర్శకుడు బోయపాటి శ్రీనివాస్. హీరోయిజం ఓ రేంజ్ లో వెండితెర మీద చూపించి… హై టెక్నికల్ వాల్యూస్ తో రోమాలు నిక్క పొడుచుకునే రీతిలో… యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించి బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించడం జరిగింది. “లక్ష్మీనరసింహా” లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత వరుస ప్లాపులు అనేక సంవత్సరాలు చూసిన బాలయ్య బాబుకి “సింహ”తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందించి… హిట్ ట్రాక్ ఎక్కించాడు. అదే రీతిలో అల్లు అర్జున్ కెరీర్లోనే ఊహించని రీతిలో “సరైనోడు” సినిమా తో మాస్ హిట్ అందించడం జరిగింది.
ప్రస్తుతం బాలయ్య బాబుతో “అఖండ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజెంట్ బాలయ్య బాబు కెరీర్ చూస్తే వరుస ప్లాపుల్లో ఉన్నారు. దీంతో ఈ సినిమాపై నందమూరి అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో బోయపాటి బాలయ్య బాబు తో హ్యాట్రిక్ విజయం సాధించి… బాలయ్య ని బోయపాటి మునుపటి మాదిరిగా హిట్ ట్రాక్ ఎక్కించాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బోయపాటి వరుసగా ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నట్లు ఫిలిం వర్గాల లేటెస్ట్ టాక్.
Read More: Balakrishna: బాలకృష్ణ అఖండ ఇంటర్వెల్ బ్యాంగ్ గూస్ బాంబ్స్ తెచ్చే సీన్..??
మేటర్ లోకి వెళ్తా ఇప్పటికే రవితేజతో అదే విధంగా అల్లు అర్జున్ తో బోయపాటికి లైన్ క్లియర్ అయినట్లు తాజాగా సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ తో కూడా బోయపాటి సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో వెంకటేష్ తో “తులసి” అనే సినిమా చేయడం జరిగింది. అయితే ఇటీవల మరోసారి వెంకటేష్ కి అదిరిపోయే మాస్ సబ్జెక్ట్ స్టోరీని బోయపాటి వినిపించినట్లు వెంకటేష్ కూడా ఓకే అన్నట్టు టాక్.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!