NewsOrbit
Entertainment News సినిమా

Skanda Trailer: స్కంద కొత్త ట్రైలర్ చూసారా – బోయపాటి అఖండ రేంజ్ హిట్ గ్యారెంటీ ?

Share

Skanda Trailer: తెలుగు సినిమా రంగంలో మాస్ నేపథ్యంలో సినిమాలు చేయడంలో డైరెక్టర్ బోయపాటి స్టైలే వేరు అని అందరికీ తెలుసు. మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సింహ, లెజెండ్, సరైనోడు, అఖండ… ప్రారంభంలో భద్ర వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. ఎటువంటి హీరోనైనా మాస్ పరంగా ప్రొఫెషనల్ గా చూపించడంలో బోయపాటి స్పెషలిస్ట్ డైరెక్టర్ అని చెప్పవచ్చు. తాజాగా ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేనితో బోయపాటి స్కంద అనే సినిమా చేయడం తెలిసిందే. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలకు సరిగ్గా మూడు రోజులకు ముందు విడుదల చేయటం జరిగింది.

Boyapati Skanda trailer look like Akhanda range it is a hit guarantee

విడుదలైన స్కంద ట్రైలర్ లో భారీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బాలకృష్ణ అఖండ రేంజ్ తరహాలో యాక్షన్ సీన్స్ ఉన్నట్లు.. తెలుస్తున్నాయి. ఇక ఇదే సమయంలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తమన్ ఓ రేంజ్ లో వాయించాడు. చాలా పవర్ ఫుల్ గా హీరో రామ్ నీ డైరెక్టర్ బోయపాటి చూపించడం జరిగింది. పొలిటికల్ నేపథ్యంలో.. ముఖ్యమంత్రికి కాబోయే అల్లుడిగా రామ్ నీ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ పూర్తి మాసీగా ర‌ఫ్ అండ్ ర‌గ్గ్ డ్ గా భారీ డైలాగ్స్ తో ఊచ‌కోత‌తో కొత్తగా క‌నిపిస్తున్నాడు. ఖచ్చితంగా మరో అఖండ తరహాలో ఈ సినిమా విజయం సాధిస్తుందని ట్రైలర్ తర్వాత కామెంట్లు వస్తున్నాయి.

Boyapati Skanda trailer look like Akhanda range it is a hit guarantee

ట్రైలర్ లో రామ్ డైలాగ్స్ ఫర్ యాక్షన్ సన్నివేశాలు బట్టి అద్భుతంగా రామ్ ఎనర్జీని… బోయపాటి గట్టిగా వాడినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ సినిమాలో యాక్షన్ కోనల్లో రామ్ కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంది. కీలకపాత్రలలో సాయి మంజరేకర్, శ్రీకాంత్ తదితరులు నటించడం జరిగింది. తాజాగా విడుదలైన స్కంద ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. పాన్ ఇండియా నేపథ్యంలో ఫస్ట్ టైం బోయపాటి చేస్తున్న ఈ సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.


Share

Related posts

Surya: సూర్య అభిమానులకు గుడ్ న్యూస్.. మరో సిరీస్ రెడీ..??

sekhar

Krishna Mukunda Murari: ఫంక్షన్ కి మురారిని రాకుండా ఆపిన ముకుందా.. నందుని మళ్లీ దగ్గరికి తీసిన భవానీ దేవి..

bharani jella

బెల్లంకొండ శ్రీనివాస్ గ్రీన్‌సిగ్న‌ల్‌

Siva Prasad