Balakrishna: బాల‌య్య ఫ్యాన్స్‌కి బోయ‌పాటి గుడ్‌న్యూస్.. ఇక ర‌చ్చ ర‌చ్చే!

Share

Balakrishna: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కించిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా, సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా న‌టించారు. బాల‌య్య ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

విడుద‌లైన వారం రోజుల్లోనే నిర్మాత‌ల‌కు మంచి లాభాలు తెచ్చిపెట్టిన ఈ చిత్రం.. ఇప్ప‌టికీ థియేట‌ర్స్‌లో కొన‌సాగుతూనే ఉంది. అన్ సీజన్ లో రిలీజైన ఈ సినిమాను.. ఏపీ, తెలంగాణలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇక తాజాగా మేక‌ర్స్ హైదరాబాద్ లో `అఖండ సంక్రాంతి సంబరాలు` పేరిట విజయోత్సవ సభను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో బాల‌య్య ఫ్యాన్స్‌కి డైరెక్ట‌ర్ బోయ‌పాటి అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పారు.

అఖండ చిత్రానికి సీక్వెల్ ఉంటుందా అని ఒక‌రు ప్రశ్నించగా.. అందుకు బోయపాటి సీక్వెల్ కి కావాల్సిన లీడ్ సినిమా చివర్లోనే వదిలాను. సీక్వెల్ గ్యారెంటీగా ఉంటుంది. ఎప్పుడు ఎలా అనేది తర్వాత చెబుతా అంటూ తెలిపారు. మ‌రి బోయ‌పాటి శ్రీ‌ను చెప్పిన‌ట్లుగా అఖండ చిత్రానికి సీక్వెల్ వ‌స్తే.. ఈ సారి కూడా బాక్సాఫీస్ వ‌ద్ద ర‌చ్చ ర‌చ్చే అని అంటున్నారు నంద‌మూరి అభిమానులు. కాగా, త‌మ‌న్ సంగీతం అందించిన ఈ చిత్రం 21 జనవరి 2022న డిస్నీ ప్ల‌స్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.


Share

Related posts

సాయి ధరం తేజ్ ని అందుకే మెగాస్టార్ చిరంజీవి తో పోల్చుకుంటున్నారు ..?

GRK

Sundari: సెన్సార్ పూర్తి చేసుకున్న “సుందరి”..!!

bharani jella

Anasuya: హ..హ ఇది నేనే అంటున్న జబర్దస్త్ బ్యూటీ ఫోటో చూశారా..

bharani jella