కమర్షియల్ సినిమాలకి ఉండాల్సిన హంగులన్నీ బోయపాటి శ్రీను సినిమాలో కచ్చితంగా ఉంటాయి, అందుకే అతి తక్కువ కాలంలోనే బోయపాటి మాస్ చిత్రాలకి కెరాఫ్ అడ్రస్ గా మారాడు. శ్రీను నుంచి సినిమా వస్తుంది అంటేనే బీ-సీ సెంటర్స్ లోని ఆడియన్స్ కి పండగ చేసుకుంటారు అంతలా వారిని మెప్పించిన బోయపాటి శ్రీనుకి, వారు ఊరమాస్ డైరెక్టర్ అనే కాంప్లిమెంట్స్ కూడా ఇస్తారు.
హీరోని ఎలివేట్ చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్, కానీ బోయపాటి శ్రీనుది మాత్రం ఒక్కటే స్టైల్.. హీరో విలన్ ని ఇరగదీయాల్సిందే. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇదే ఫాలో అవుతున్న బోయపాటి సినిమాలో కనిపించే ఒకే ఒక్క పాయింట్, తప్పు చేస్తే చంపేయడమే. ఒక మాములు హీరోని కూడా మాస్ ఆడియన్స్ కి దగ్గర చేయగల సత్తా ఉన్న బోయాతి శ్రీను, ప్రతి హీరోని ముందెన్నడూ చూడనంత కొత్తగా చూపిస్తాడు, అతనితో భారీ డైలాగులు, అంత కన్నా భారీ ఫైట్లు చేయిస్తాడు.
ఒకటి రెండు తప్ప పెద్దగా ఫ్లాప్స్ లేని బోయపాటి శ్రీని టార్గెట్ ఎప్పుడూ మాస్ ఆడియన్స్ ఏ, టాక్ తో సంబంధం లేకుండా బోయపాటి సినిమాని చూసేది కూడా వాళ్లే. అయితే ప్రతిసారి కథ చెప్పే విధానంలో కానీ, కథన ప్రయాణంలో కానీ ఫుల్ క్లారిటీ పాటించే బోయపాటి మొదటి సారి కన్ఫ్యూషన్ లో పడినట్లు ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వినయ విధేయ ప్రొమోషన్స్ జరుగుతున్న విధానం చూస్తుంటే అదే నిజమని పిస్తోంది. ఎందుకంటే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి మాస్ ఆడియన్స్ టార్గెట్ గా కంటెంట్ ని రిలీజ్ చేసే బోయపాటి, ఇప్పుడు వినయ విధేయ రామ విషయంలో మాత్రం క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా థియేటర్ వైపు నడిపించడానికి నానా కష్టాలు.పడుతున్నాడు ఒక ఫ్యామిలీ సాంగ్ వదిలి, కుటుంబ ప్రేక్షకులని మెప్పించగానే, నెక్స్ట్ ఒక మాస్ సాంగ్ కానీ పోస్టర్ కానీ కానీ వదిలి బీ-సీ సెంటర్స్ ని ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాడు.
ఆడియన్స్ ని డివైడ్ చేసి ప్రమోట్ చేయడం బోయపాటికి అలవాటు లేని పని కావడంతోనే వినయ విధేయ రామ సినిమా నుంచి ఇప్పటి వరకూ బయటకి వచ్చిన కంటెంట్, ఏదో ఒక సెట్ ఆడియన్స్ కి మాత్రమే సింక్ అవుతుంది కానీ అందరికీ నచ్చేది మాత్రం రాలేదు. కమర్షియల్ సినిమాకే కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న బోయపాటి కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించి ఉండడు. అయితే ఈ కన్ఫ్యూషన్ ప్రొమోషన్స్ లో మాత్రమే కానీ సినిమాలో మాత్రం తప్పకుండా ఉండదు, ఎందుకంటే వినయ విధేయ రామ పక్కా బోయపాటి మార్క్ సినిమా కాబట్టి హిట్ కొట్టడంలో మాత్రం కన్ఫ్యూషన్ ఉండదు. సో, బోయపాటి మార్క్-చరణ్ మ్యానియా కలిసి వినయ విధేయ రామ సినిమాని మాస్ కి కనెక్ట్ చేస్తుంది అనడంలో సందేహం లేదు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ న ఎంత వరకూ మెప్పిస్తారు అనేదే ఇప్పుడు అతిపెద్ద సందేహంగా మిగిలింది.