Boyapati: డైరెక్టర్ బోయపాటి శ్రీను ఇటీవల బాలకృష్ణతో అఖండ సినిమా చేసి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. అఖండ సినిమాకి ముందు బోయపాటి తీసిన వినయ విధేయ రామ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. హీరో రామ్ చరణ్ అదే రీతిలో బోయపాటి కెరీర్ లో అతి పెద్ద అట్టర్ ఫ్లాప్ సినిమాగా నిలిచింది. ఇటువంటి తరుణంలో బోయపాటి శ్రీను అఖండ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో నిరూపించాడు. వరస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య బాబు కి మర్చిపోలేని హిట్ ఇవ్వటం మాత్రమే కాక.. హ్యాట్రిక్ విజయం కూడా సాధించాడు.
గతంలోనే బోయపాటి బాలయ్య తో సింహా, లెజెండ్ సినిమాలు చేసి సూపర్ డూపర్ హిట్లు అందుకోవడం జరిగింది. దీంతో అఖండ హిట్ కావడంతో హ్యాట్రిక్ ఇద్దరికీ పడింది. ఇటువంటి తరుణంలో బోయపాటి నెక్స్ట్ సినిమా ఎవరితో అనేదానిపై ఇండస్ట్రీలో రకరకాల వార్తలు వస్తున్నాయి. మొన్నటి వరకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేస్తున్నట్లు వార్తలు రాగా తాజాగా మరో యాంగ్ హీరోకి.. బోయపాటి స్టోరీ రాస్తున్నట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు రామ్ పోతినేని.
వరస ఫ్లాపుల్లో ఉన్న రామ్.. 2019 వ సంవత్సరం లో “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో అదిరిపోయే మాస్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన “రెడ్” సినిమా అంతగా ప్రేక్షకులను అలరించలేదు. ఈ క్రమంలో బోయపాటి ఓ పవర్ ఫుల్ మాస్ సబ్జెక్ట్ కలిగిన లైన్ ఒకటి ఇటీవల రామ్ కి వినిపించినట్లు.. అంతా ఓకే అయినట్టు సమాచారం. ప్రస్తుతం పూర్తి స్టోరీ రాయడానికి బోయపాటి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో టాక్. అంతా ఓకే అయితే ఫిబ్రవరి నెల చివరిలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి.. అధికారిక ప్రకటన రానున్నట్లు ఇండస్ట్రీకి చెందినవారు చెప్పుకొస్తున్నారు. అంతమాత్రమే కాకుండా రామ్ సొంత బేనర్ స్రవంతి మూవీస్ ఈ సినిమాను నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు కూడా ఇండస్ట్రీ టాక్.