Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. ఇదిలా ఉంటే ఈ రామ్ పోతినేని సినిమాకి డైరెక్టర్ బోయపాటి .. బాలకృష్ణ(Balakrishna) సినిమాలో ఫార్ములా వాడుతున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా లెజెండ్(Legend), సింహా(Simha), అఖండ(Akhanda) సినిమాలు తెరకెక్కాయి. మూడు కూడా సూపర్ డూపర్ హిట్ సినిమాలే. బాలయ్య కెరియర్ లోనే అత్యధిక వసూలు సాధించిన సినిమాలుగా నిలిచాయి.
ముఖ్యంగా గత ఏడాది “అఖండ” బాలయ్య కెరియర్ లోనే అత్యధిక వసూలు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. అయితే బాలయ్యతో చేసిన సినిమాలలో అన్ని హిట్ కావటంతో ఎక్కువగా డబల్ క్యారెక్టర్… సబ్జెక్ట్ కలిగిన స్టోరీలు కావటంతో రామ్ పోతినేనితో చేయబోయే సినిమా కూడా ఆ తరహా ఫ్లేవర్ కలిగిన మూవీ అని సమాచారం. కథపరంగా రామ్ నీ ద్విపాత్రబినయంగా బోయపాటి చూపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హై వోల్టేజ్ మాస్.. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తరహాలో ఈ సినిమా స్క్రిప్ట్ బోయపాటి రెడీ చేసినట్లు సమాచారం.
తమిళ దర్శకుడు లింగు స్వామి(Lingu Swamy) దర్శకత్వంలో రామ్ నటించిన “దీ వారియర్”(The Warrior) జులై 14న విడుదల కానుంది. ఈ సినిమా విడుదలైన అనంతరం బోయపాటి ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ లో రామ్ జాయిన్ కానున్నారు. “అఖండ”తో భారీ బ్లాక్ బస్టర్ అందుకోవటంతో అంతకుమించి.. రామ్ పోతినేనికి హిట్ ఇవ్వడానికి బోయపాటి ప్లాన్ చేసినట్లు సమాచారం. అంతేకాదు ఇది పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…
ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…