వరుణ్‌తేజ్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం `వాల్మీకి`. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి వివాదాలకే కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఓ గ్యాంగ్‌స్టర్ సినిమాకు వాల్మీకి అనే టైటిల్ పెట్టడం బాలేదని బోయ సామాజిక వర్గం అభ్యంతరాన్ని తెలియజేశారు. పలు సందర్భాల్లో నిరసనలు తెలిపారు, ఫిర్యాదులు కూడా చేశారు. మరోపక్క సినిమా సెప్టెంబర్ 20న విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ను బోయ సామాజికి వర్గానికి చెందిన వ్యక్తులు కలిశారు. ఆయన సమక్షంలో సెన్సార్ బోర్డుకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా “`వాల్మీకి అనే టైటిల్ మార్చాలని బోయ సామాజిక వర్గం భావిస్తున్నారు. మార్చకపోతే బోయలంతా ఏకమవుతారు. తర్వాత జరిగే పరిణామాలకు దర్శక నిర్మాతలు, నటీనటులే బాధ్యత వహించాలి“ అని లక్ష్మణ్ తెలిపారు.
previous post
next post