NewsOrbit
Entertainment News సినిమా

Srikanth Addala: “బ్రహ్మోత్సవం” ఫ్లాప్ టైములో.. మహేష్ ఏమన్నారు అంటే శ్రీకాంత్ అడ్డాల సంచలన వ్యాఖ్యలు..!!

Share

Srikanth Addala: శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో “పెద్ద కాపు” అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 29వ తారీకు ఈ సినిమా విడుదల కాబోతుంది. రెగ్యులర్ పంతానికి భిన్నంగా శ్రీకాంత్ అడ్డాల ఒక సున్నితమైన అంశాన్ని.. తీసుకొని చేసిన ఈ సినిమా అందరి దృష్టి ఏర్పడింది. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. పెదకాపుకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి. విరాట్ కర్ణ, నాగబాబు, అనసూయ, రావు రమేష్, ఈశ్వరి రావు, తనికెళ్ల భరణి ఇంకా చాలామంది పెద్దపెద్ద నటీనటులు నటించడం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాంత్ అడ్డాల గతంలో మహేష్ బాబుతో ఉన్న అనుబంధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Brahmotsavam flop What Mahesh said is Srikanth Addala sensational comments

ముఖ్యంగా మహేష్ బాబుతో చేసిన రెండో సినిమా “బ్రహ్మోత్సవం” అట్టర్ ఫ్లాప్ కావడంపై ఆ టైంలో అనుభవాలు గురించి చెప్పుకొచ్చారు. “బ్రహ్మోత్సవం” పరాజయం పాలు కావడానికి కారణం నేనే. స్క్రిప్ట్ పరమైన పొరపాటు కారణంగా సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఎందుకు ఈ సినిమా ఫ్లాప్ అయింది అనే విషయాన్ని పరిశీలన చేసినప్పుడు అయ్యో అనిపించింది. ఏ విషయాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళాము అదే చెప్పలేకపోయాను మిస్ ఫైర్ అయ్యింది అని గుర్తించాను.

Brahmotsavam flop What Mahesh said is Srikanth Addala sensational comments

ఈ క్రమంలో బ్రహ్మోత్సవం సినిమా చూసి థియేటర్ నుండి బయటకు రాగానే ముందుగా నాకు ఈశ్వరి రావు కాల్ చేశారు. నీలో చాలా టాలెంట్ ఉంది.. అధైర్య పడకండి. ఆ తర్వాత అల్లు అరవింద్ గారు ఎమోషన్స్ గొప్పగా చూపించే దర్శకులలో మీరు కూడా ఒకరు. మరోసారి పెద్ద హిట్ ఇస్తారని అనుకుంటున్నాను. ఇక మహేష్ బాబు గారు సినిమా చూసిన తర్వాత ఒక్కోసారి అలా జరుగుతుంటాయి అంటూ సపోర్ట్ చేస్తూ మాట్లాడారు అని శ్రీకాంత్ అడ్డాల స్పష్టం చేయడం జరిగింది.


Share

Related posts

Bigg Boss 7 Telugu: మరోసారి బిగ్ బాస్ హౌస్ పై మండిపడ్డ సీపీఐ నారాయణ..!!

sekhar

F3 : “ఎఫ్3″లో మూడో హీరో ఎవరో క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..!

Teja

Liger : లైగర్ కి మళ్ళీ కరోనా దెబ్బ..ముంబై నుంచి సర్దేసుకొని వస్తున్నారా..?

GRK