Breaking: టాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా కలకలం రేపుతోంది. మంచు మనోజ్ తర్వాత మళ్లీ ఇప్పుడు మరొక కుర్ర హీరో కరోనా వైరస్ బారిన పడ్డాడు. యంగ్ హీరో విశ్వక్సేన్ తాజాగా కోవిడ్-19 నిర్థారణ పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు విశ్వక్సేన్.
<img src="https://newsorbit.com/wp-content/uploads/2021/12/IMG-20211231-WA0076-300×176.jpg" alt="" width="300" height="176" class="alignnone size-medium wp-image-226243" /
"నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. వెంటనే నేను ఐసోలేషన్ లోకి వెళ్లాను. డాక్టర్ సలహా మేరకు అన్ని సురక్షితమైన ప్రోటోకాల్ ఫాలో అవుతున్నాను. టీకా తీసుకున్న తర్వాత కూడా ఈ కొత్త స్ట్రెయిన్ దావానలంలా వ్యాప్తి చెందుతోంది. దయచేసి మాస్కులు ధరించండి. సురక్షితంగా ఉండండి. మీ అందరి ప్రేమ, మద్దతు లకు ధన్యవాదాలు." అని విశ్వక్సేన్ పేర్కొన్నాడు.
ప్రస్తుతం విశ్వక్సేన్ రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవలే పాగల్ సినిమాతో పలకరించాడు.