RC 16: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన సినిమా చేయటానికి రెడీ అయినట్లు గత కొద్ది రోజుల నుండి ఓ వార్త వైరల్ అవుతూ ఉంది. అయితే ఈ వార్తకు సంబంధించి అధికారిక పోస్టర్ మైత్రి మూవీ బ్యాకర్స్ బ్యానర్ వారు రిలీజ్ చేశారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో చరణ్ సినిమా చేస్తున్నట్లు తెలిపారు. “RC 16” వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనున్నట్లు సమాచారం. అంతేకాకుండా స్పోర్ట్స్ నేపథ్యంలో.. ఈ సినిమా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాకి సంబంధించి అధికారిక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం చరణ్ తమిళ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో “RC 15” చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో జరుగుతుంది. సమ్మర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. చరణ్ కెరియర్ లోనే ఇది అత్యంత హై బడ్జెట్ సినిమా. దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా తర్వాత గౌతం తిన్ననూరి దర్శకత్వంలో.. చరణ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ కావడంతో ఇప్పుడు బుచ్చిబాబు సానతో చరణ్ ప్రాజెక్టు ఒప్పుకోవడం జరిగింది.
మరోపక్క బుచ్చిబాబు కూడా ఉప్పెన వంటి సూపర్ హిట్ తర్వాత తారక్ కోసం సినిమా సెట్ చేయడం మాత్రమే కాదు చాలా కాలం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అయితే తారక్ కొరటాల శివ సినిమా కంప్లీట్ అయ్యాక బుచ్చిబాబుతో చేయాలని ప్లాన్ చేస్తూ ఉండటంతో టైం ఉన్నా కొద్ది గడుస్తూ ఉండటంతో ఈలోపు చరణ్ నీ బుచ్చిబాబు లైన్ లో పెట్టడం జరిగింది. “RC 16″తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో స్టార్ట్ కానున్నట్లు సమాచారం.