Sukumar: సుకుమార్‌కు బాలీవుడ్ హీరో బంపర్ ఆఫర్..పుష్ప 2 వదిలేస్తున్నాడా..?

Share

Sukumar: సుకుమార్‌కు బాలీవుడ్ హీరో బంపర్ ఆఫర్..పుష్ప 2 వదిలేస్తున్నాడా..? అంటే దానికి సమాధానం మాత్రం సరిగ్గా దొరకడం లేదు. ఇక సుక్కుకు ఆ బంపర్ ఆఫర్ ఇచ్చిన హీరో ఎవరో కాదు ఖిలాడి అక్షయ్ కుమార్. గత నాలుగైదేళ్ళుగా బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ మాంచి ఊపు మీదున్నాడు. ఖాన్‌ల త్రయం కూడా వెనక్కి వెళ్ళిపోయారు అక్కీ దెబ్బకు. ఈ మధ్య సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్‌ల చిత్రాలు అంతగా వచ్చినవి లేవనే చెప్పాలి. ఒకప్పుడు ఈ ముగ్గురుకంటే కాస్త తక్కువగా ఉండే అక్షయ్ కుమార్ ఇప్పుడు బాలీవుడ్‌లో తనే నంబర్ 1 స్థానంలో ఉన్నారు.

bumper offer from bollywood to sukumar
bumper offer from bollywood to sukumar

ఈ అయిదేళ్ళలో అక్షయ్ కుమార్ నటించిన దాదాపు అన్నీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి. 100 కోట్ల లోపే ఉండే ఆయన సినిమాల బడ్జెట్ అంతకు నాలుగింతలు వసూళ్ళు రాబడుతూ నిర్మాతలను బాగా లాభాల్లో ముంచేస్తున్నారు. మంచి సోషల్ మెసేజ్ ఉన్న కథలను ఎంచుకుంటున్న అక్షయ్ సొంత నిర్మాణ సంస్థలతో పాటు బయట నిర్మాణ సంస్థలలోనూ సినిమాలను చేస్తున్నారు. అయితే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో ఈ ఖిలాడి హీరోకు సినిమా చేయాలని ఉందట.

Sukumar: సుకుమార్ ఇప్పుడు పూర్తిగా పుష్ప 2 మీద ఉన్నారు.

ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు సుకుమార్ వెల్లడించారు. పుష్ప సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్షయ్ కుమార్ నుంచి నాకు ఫోన్ వచ్చిందని సుక్కూ తెలిపాడు. మనం సినిమా చేయాలి ముంబై రా అని పిలిచినట్టు సుకుమార్ తెలిపారు. అయితే తనకు ముందు పుష్ప 2 కంప్లీట్ చేయడమే టార్గెట్ అని తెలిపిన సుకుమార్ త్వరలో అక్షయ్ కుమార్‌ను కలుస్తానని.. హిందీలో సినిమా చేస్తే ముందు ఆయనతోనే చేస్తాని చెప్పుకొచ్చారు. బాలీవుడ్‌లో స్ట్రైట్ సినిమా చేయాలనుకుంటున్నట్టు సుక్కూ తెలిపారు. కాగా, సుకుమార్ ఇప్పుడు పూర్తిగా పుష్ప 2 మీద ఉన్నారు. పుష్ప పార్ట్ 1తో ఐకాన్ స్టార్‌కు పాన్ ఇండియన్ స్టార్‌గా క్రేజ్ తెచ్చిపెట్టారు. ఆయనకు పాన్ ఇండియన్ డైరెక్టర్‌గా కూడా క్రేజ్ సంపాదించుకున్నారు.


Share

Related posts

Chiranjeevi: మెగాస్టార్ ప్లాన్ అదే అయితే ..మెగా ఫ్యాన్స్‌కు ఇంతకంటే బ్యాడ్ న్యూస్ ఇంకోటి ఉండదు..

GRK

జూన్ 6 రాశి ఫలాలు శనివారం మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూడండి

Kumar

కేసీఆర్ కు షాక్ …. సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట‌పెట్టిన కేటీఆర్

sridhar