29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Allu Arjun: సోషల్ మీడియాలో బన్నీ నన్ను బ్లాక్ చేశాడు హీరోయిన్ సంచలన కామెంట్స్..!!

Share

Allu Arjun: ఐకాన్ స్టార్ బన్నీ క్రేజ్ దేశ విదేశాలలో పాకిపోయిన సంగతి తెలిసిందే. “పుష్ప” సినిమాతో ఒక్కసారిగా బన్నీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. తగ్గేదేలే డైలాగ్.. తో బన్నీకి తిరుగులేని ఇమేజ్ రావటం జరిగింది. 2021లో వచ్చిన “పుష్ప” సినిమా ఊహించని విజయం సాధించటంతో పాటు తిరుగులేని పాపులారిటీ బన్నీకి తెచ్చి పెట్టింది. ఇలాంటి తరుణంలో బన్నీ పై సోషల్ మీడియాలో “వరుడు” హీరోయిన్ భాను శ్రీ మెహరా సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను అల్లు అర్జున్ కావాలని ట్విట్టర్లో బ్లాక్ చేశాడని స్క్రీన్ షాట్ తీసి మరీ పెట్టేసింది. దీంతో అసలు కారణం ఏంటి అన్న చర్చ సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యింది. ఈ వార్త వైరల్ అవుతూ ఉన్న సమయంలో బన్నీ.. వెంటనే ఆమెను అన్ బ్లాక్ చేయడం జరిగింది.

Bunny blocked me on social media Heroine sensational comments

అయితే తనను బ్లాక్ చేయటంపై పాజిటివ్ గానే స్పందించింది. బన్నీ ఎందుకు తనని బ్లాక్ చేసాడో అర్థం కావడం లేదని తెలిపింది. ఆయనను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని పేర్కొంది. ఈ పోస్ట్ పెట్టిన కాసేపటికే తనని అన్ బ్లాక్ చేశారని తెలుపుతూ ధన్యవాదాలు తెలిపింది. గుణశేఖర్ దర్శకత్వంలో 2010లో వచ్చిన “వరుడు” అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దర్శకుడిగా గుణశేఖర్ కి ఇది పదవ సినిమా. అయినా గాని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కానీ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ విభాగంలో నంది అవార్డు కైవసం చేసుకుంది.

Bunny blocked me on social media Heroine sensational comments

ఈ సినిమాలో తమిళ నటుడు ఆర్య విలన్ పాత్రలో నటించాడు. సుహాసిని, మణిరత్నం, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం.. వంటి కీలక నటులు నటించారు. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాకీ మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమాతోనే భాను శ్రీ మెహరా హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమా పరాజయం కావడంతో తర్వాత అవకాశాలు రాలేదు. ఈ క్రమంలో బన్నీపై శాతం మీడియాలో తనని బ్లాక్ చేశారని భాను శ్రీ మెహర పోస్ట్ పెట్టడం వైరల్ అయింది.


Share

Related posts

Intinti Gruhalakshmi: విక్రమ్ కి దివ్య కి ఉన్న రిలేషన్ ఏంటి.. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Ananya nagalla : అనన్య నాగళ్ల గ్లామర్‌తో మేకర్స్‌ని పడేస్తుందా..?

GRK

Ram Charan: శంకర్ సినిమా హిట్ అవ్వాలని తనకి కలిసి వచ్చిన ప్లేస్ లో షూటింగ్ స్పాట్ పెట్టిన రామ్ చరణ్..??

sekhar