Charan Bunny: మెగా హీరోలలో మంచి జోరు మీద వున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఐకన్ స్టార్ బన్నీ. ముందుగా బన్నీ నటించిన పుష్ప పాన్ ఇండియా నేపథ్యంలో రిలీజ్ అయ్యి.. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అదిరిపోయే హిట్ అందుకోవడం తెలిసిందే. పుష్ప లో బన్నీ పలికిన డైలాగులు… వేసిన స్టెప్పులు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. కనీసం ప్రమోషన్ కార్యక్రమాలు చేయకపోయినా గాని బాలీవుడ్ ఇండస్ట్రీలో పుష్ప వందకోట్లు కలెక్ట్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక చరణ్ RRR తో సత్తా చాటి ఏకంగా వెయ్యి కోట్ల మార్కెట్ అందుకున్న హీరోగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం తెలిసిందే. దీంతో ఇద్దరి హీరోలకు పాన్ ఇండియా పరంగా తిరుగులేని మార్కెట్ ప్రజెంట్ ఉంది. ఈ క్రమంలో సౌత్ లో మరింత పట్టు బిగించే విధంగా.. చరణ్, బన్నీ అదిరిపోయే ప్లానింగ్ తో సినిమాలు ఒకే చేస్తున్నట్లు ఇండస్ట్రీలో సరికొత్త టాక్ నడుస్తోంది. బన్నీకి తెలుగులో ఎంత మార్కెట్ ఉందో అదే రీతిలో మలయాళంలో ఉండటం తెలిసిందే. అయితే ఇప్పుడు తమిళ మార్కెట్ పై బన్నీ ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బన్నీ.. పుష్ప సెకండ్ పార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.
అయితే ఈ ప్రాజెక్ట్ అయిన వెంటనే తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా చేయడానికి బన్నీ రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్. ఇదే సమయంలో చరణ్ ఆల్ రెడీ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంకా పూర్తవకుండానే మరో తమిళ డైరెక్టర్ నీ చరణ్ ఓకే చేసినట్లు సమాచారం. ఆ డైరెక్టర్ మరెవరో కాదు లోకేష్ కనకరాజ్. కమల్ హసన్ హీరోగా విక్రమ్ సినిమా తీస్తున్న లోకేష్ కనగరాజ్.. త్వరలో చరణ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తమిళ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వెలువడుతున్నాయి. సో మొత్తంమీద చూసుకుంటే బన్నీ, చరణ్ తమిళ మార్కెట్ పై గట్టిగా ఫోకస్ పెట్టినట్లు తాజా వార్తలు బట్టి అర్థం అవుతోంది అని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.