Pushpa 2: ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా “పుష్ప 2” నుండి రిలీజ్ అయిన స్పెషల్ వీడియో యూట్యూబ్ లో అనేక రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియో ద్వారా రెండో భాగం పుష్ప ఏ రకంగా ఉంటుందన్నది సుకుమార్ కొద్దో గొప్పో హింట్స్ ఇవ్వడం జరిగింది. చాలావరకు పొలిటికల్ టచ్ స్టోరీలో కనిపిస్తూ ఉంది. జైలు పాలు అయిన పుష్ప… బుల్లెట్ గాయాలతో తప్పించుకోవటం.. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లోనే.. “పుష్ప ది రూల్” అనే డైలాగులు చెప్పటం చాలా వైలెంట్ ఫ్లేవర్ సినిమాలో కనిపిస్తూ ఉంది. అయితే స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయ్యాక అమ్మవారి డ్రెస్సులో చీర కట్టుకుని బన్నీ లుక్ చాలామందిని ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ సెన్సేషన్ రికార్డు క్రియేట్ చేసింది.
ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చిన ఈ పోస్టర్.. ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ లో మోస్ట్ లైక్డ్ పోస్టర్ గా టాప్ మోస్ట్ ఫస్ట్ స్థానంలో నిలిచినట్లు సినిమా యూనిట్ స్పష్టం చేసింది. సోషల్ మీడియాని పుష్ప రూల్ చేస్తున్నాడని సినిమా యూనిట్ ప్రకటించింది. నిన్న బన్నీ పుట్టినరోజు నేపథ్యంలో సోషల్ మీడియాలో పుష్ప సెకండ్ పార్ట్ వీడియో మరియు ఫోటోలు భారీ ఎత్తున ట్రెండింగ్ వైరల్ అయ్యాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోలు ప్రముఖులు చాలామంది పుష్ప సినిమా ఉద్దేశించి… మాట్లాడుతూ బన్నీకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
2021 డిసెంబర్ నెలలో వచ్చిన పుష్ప మొదటి పార్ట్ అనేక రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో పుష్ప సెకండ్ పార్ట్… మొదటి భాగం కంటే అనేక భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో ఇంటర్నేషనల్ డాన్ గా ఇంకా పొలిటికల్ నేతగా కూడా బన్నీ కనిపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మొదటి భాగం ఊహించని విధంగా విజయం సాధించడంతో సెకండ్ పార్ట్ స్క్రిప్ట్.. విషయంలో డైరెక్టర్ సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అంట. ఇంకా మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్.. చాలా పాటలు కంప్లీట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బ్యాంకాక్ లో దట్టమైన అడవులలో పుష్ప 2 సినిమా షూటింగ్ జరుగుతుంది.