Vijay devarakonda: బ‌న్నీ ఫ్యాన్స్‌ని తిక‌మ‌క‌లో ప‌డేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..ట్వీట్ వైర‌ల్‌!

Share

Vijay devarakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక్క ట్వీట్‌తో బ‌న్నీ ఫ్యాన్స్‌ని తిక‌మ‌క‌లో ప‌డేశాడు. విజ‌య్ ఏం ట్వీట్ చేశాడో.. అస‌లు ఏం జ‌రిగిందో.. ఇప్పుడు తెలుసుకుందాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. ర‌ష్మిక మందన్నా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా బ్యాన‌ర్ల‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రెండు భాగాలుగా ఈ చిత్రం రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ను `పుష్ప ది రైజ్‌` పేరుతో డిసెంబ‌ర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుద‌ల చేశారు. తొలిరోజునే కాస్త నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వ‌ద్ద గ‌ట్టిగా నిల‌బ‌డి భారీ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. త‌మిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం అనూహ్యమైన రెస్పాన్స్‌తో సూప‌ర్ క‌లెక్ష‌న్స్‌ను వ‌సూల్ చేసింది.

ఇక ప్ర‌స్తుతం సుకుమార్‌, బ‌న్నీలు సెకెండ్ పార్ట్‌ `పుష్ప ది రూల్‌`ను త్వ‌ర‌త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు ప‌నులు షురూ చేశారు. ఇలాంటి త‌రుణంలో పుష్ప‌కు పార్ట్-3 కూడా ఉండ‌బోతోంద‌ని అర్థం వ‌చ్చేలా విజ‌య్ దేవ‌ర‌కొండ ట్వీట్ చేశాడు. అస‌లేమైందంటే నిన్న సుకుమార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విజ‌య్ ట్వీట్ట‌ర్ ద్వారా విషెస్ తెలిప‌గా.. ప్ర‌స్తుతం ఆయ‌న ట్వీట్ తెగ వైర‌ల్ అవుతోంది.

`హ్యాపీ బ‌ర్త్‌డే సుకుమార్ సార్‌..మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను. అలాగే మీతో నా సినిమా స్టార్ట్ అయ్యే రోజ్ కోసం ఆగ‌లేక‌పోతున్నాను` అంటూ ట్వ‌ట్ట‌ర్ పోస్ట్‌లో పేర్కొన్న విజ‌య్‌.. చివర్లో `2021- ది రైజ్‌, 2022- ది రూల్‌, 2023- ది ర్యాంపేజ్‌` అని రాసుకొచ్చాడు. దీంతో పుష్ప‌కు మూడో భాగం కూడా ఉంటుందా..? అస‌లు విజ‌య్ ఎందుక‌లా ట్వీట్ చేశాడు..? అంటూ బ‌న్నీ అభిమానులు మ‌రియు నెటిజ‌న్లు చ‌ర్చ‌లు మొదలు పెట్టేశారు.


Share

Related posts

Pawan Kalyan: నైజాం లో ఏ హీరో సృష్టించని రికార్డ్ ఫస్ట్.. పవన్ ఫ్లాప్ సినిమా సృష్టించింది..!!

sekhar

Manchu Manoj: ఏపి సీఎం సీఎం వైఎస్ జగన్ ను కలిసి సినీనటుడు మంచు మనోజ్..! కలయికపై ఏమన్నారంటే..?

somaraju sharma

సెన్సార్ పూర్తిచేసుకున్న”ఎన్టీఆర్-కథానాయకుడు”

Siva Prasad