Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ ‘పుష్ప : ది రైజ్’. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి క్రేజ్ ఇంకా తగ్గలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శేషాచలం కొండల్లో మాత్రమే పెరిగే అరుదైన కలప ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపించారు. దీంతో సౌత్ తో పాటు.. అటు నార్త్ లోనూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది పుష్ప. దీంతో ఇపుడు పుష్ప..ది రూల్‌పై అందరి ఫోకస్ పడింది. అతి త్వరలోనే పట్టాలెక్కనున్న “పుష్ప-2″కి సంబంధించి కొత్తగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇప్పుడు బయటకొచ్చింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
నడివయసు పాత్రలో అల్లు అర్జున్!
ఈ సినిమాలో హీరోకి – విలన్ కి మధ్య జరిగే పోరాటమే ప్రధానంగా హైలైట్ చేయనున్నారు. ఈ సినిమాలో బన్నీని నడివయసు పాత్రలో (55 ఏళ్ల వ్యక్తిలా) చూపించనున్నారని అంటున్నారు. సినిమా చివరలో ఆయన ఆ లుక్ తో కనిపిస్తాడా? లేదంటే పోలీసుల బారి నుంచి తప్పించుకోవడానికి ఆయన ఆ గెటప్ వేస్తాడా? అనేది చూడాలి. నడి వయసు పాత్రలో ఆయన తెరపై కనిపించడం మాత్రం పక్కా అంటున్నారు. అంతేకాక ఆ పాత్రకు ఓ కొడుకు, కూతురు కూడా సినిమాలో కనిపించబోతున్నారనేది టాక్. మరి ఇందులో నిజా నిజాలేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయాలనేది మేకర్స్ ఆలోచనగా కనిపిస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
‘పుష్ప 2’ కు 400 కోట్ల బడ్జెట్..
‘పుష్ప’ సినిమా సక్సెస్ కి కథాకథనాలతో పాటు దేవిశ్రీ పాటలు కూడా చాలా వరకూ కారణమయ్యాయి. దాంతో ఈ సారి తన నుంచి అంతకు మించిన అవుట్ పుట్ ఇవ్వడానికి దేవిశ్రీ రెడీ అవుతున్నాడని చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమా కోసం 400 కోట్లను కేటాయించినట్టు సమాచారం. బన్నీ మేనరిజం, ‘తగ్గెదే లే’ మరియు ‘పుష్ఫ అంటే ఫ్లవర్ అనుకుంటివా’ అనే వన్ లైన్ డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఏకంగా పాపులర్ క్రికేటర్స్, పొలిటిషియన్స్, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కూడా కూడా పుష్ఫ మేనియాను ఫాలోకావడంతో ఈ సినిమా అంతర్జాతీయంగా ఎక్కువగా రీచ్ అయ్యింది. ఈ కారణంగా సినిమాను ఇండియన్ ఐకానిక్ ఫిల్మ్ గా గుర్తించారు.