33.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Allu Arjun: అర్జున్ రెడ్డి దర్శకుడితో బన్నీ మూవీ అధికారిక ప్రకటన..!!

Share

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం “పుష్ప 2” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది నెలల క్రితం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. మొదట వైజాగ్ తర్వాత హైదరాబాద్ మరికొద్ది రోజుల్లో బ్యాంకాక్ సినిమా యూనిట్ వెళ్లనుంది. అత్యంత శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. 2021లో వచ్చిన “పుష్ప” మొదటి భాగం ఊహించని విజయం సాధించడం తెలిసిందే. “పుష్ప” మానియా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా నిండుకుంది. తగ్గేదేలే డైలాగ్ చాలా పాపులర్ అయింది.

Bunny movie official announcement with director Arjun Reddy

సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీలు ఇంకా రాజకీయ నాయకులు చాలామంది ఈ డైలాగ్ ఇప్పటికీ వాడుతూనే ఉన్నారు. “పుష్ప” మొదట భాగం రికార్డు స్థాయి వసూలు రాబట్టింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేయకపోయినా దాదాపు 100 కోట్లకు పైగానే కలెక్ట్ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ మొదటి భాగం కంటే మరిన్ని ఎక్కువ భాషల్లో విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో సినిమా అధికారికంగా ప్రకటించేశారు. పూర్తి విషయంలోకి వెళ్తే “అర్జున్ రెడ్డి” సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ దర్శకుడిగా మారిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు తెలిపారు.

Bunny movie official announcement with director Arjun Reddy

ఈ సినిమాని బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ నిర్మిస్తోంది. “దేశంలోనే మొగుడు పవర్ హౌసులు.. అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగ, భూషణ్ ల కాంబినేషన్ లో మూవీ రాబోతోంది. ఇందుకు సిద్ధంగా ఉండండి” అని టి సీరిస్ ట్వీట్ చేయటం జరిగింది. ఈ ప్రకటనతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఆనందంగా ఉన్నారు. సరైన దర్శకుడితో తమ అభిమాన హీరోకి సినిమా పడిందని కామెంట్లు చేస్తున్నారు.


Share

Related posts

Samyuktha Karthik Beautiful Pics

Gallery Desk

Rashmika Mandana: మరో మెగా హీరో సరసన బిగ్ ఆఫర్ అందుకున్న రష్మిక మందన..??

sekhar

ప‌రుగుల రాణి పాత్ర‌లో..

Siva Prasad