Pushpa Re Release: ఐకాన్ స్టార్ బన్నీ నటించిన “పుష్ప” డిసెంబర్ 17వ తారీకుకి విడుదలయ్యి ఏడాది కావస్తొంది. బన్నీ కెరియర్ లో ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. అనేక రికార్డులు క్రియేట్ చేసింది. “పుష్ప”గా బన్నీ పలికిన డైలాగులు వేసిన స్టెప్పులు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తగ్గేదేలే అనే డైలాగ్ ఎంతోమందిని ఆకట్టుకుంది. ఇప్పటికీ కూడా చాలామంది సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పోర్ట్స్ స్టార్స్… ఈ డైలాగ్ వాడుతూ ఉన్నారు.
ఒకప్పుడు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో… హవా కొనసాగించిన బన్నీకి ఇప్పుడు నేషనల్ లెవెల్ లో … క్రేజ్ పెరిగింది. ఇదిలా ఉంటే “పుష్ప” రిలీజ్ అవ్వకముందు తెలుగుతో సమానంగా మలయాళంలో బన్నీకి మార్కెట్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా మలయాళంలో మన్నోడిని మల్లు అర్జున్ అని కూడా.. పిలుస్తుంటారు. ఈ క్రమంలో… వచ్చే నెలలో “పుష్ప” రిలీజ్ అయ్యి ఏడాదికావస్తు ఉండటంతో… అక్కడ రీ రిలీజ్ చేయడానికి “పుష్ప” సినిమా యూనిట్ రెడీ అయింది. మలయాళంలో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా… సినిమా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
డిసెంబర్ 17వ తారీఖు మాత్రం మలయాళంలో మాత్రం ఖచ్చితంగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం “పుష్ప 2” షూటింగ్ చాలా శరవేగంగా చేస్తూ ఉన్నారు. మొదటి భాగం కంటే రెండో భాగం భారీ హీట్ అయ్యే రీతిలో… అన్ని జాగ్రత్తలు తీసుకుని… మరిన్ని ఎక్కువ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.