Bunny: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా “గంగోత్రి” సినిమాతో బన్నీ ఎంట్రీ ఇవ్వటం తెలిసిందే. ఈ సినిమాతో హిట్ కొట్టినా గాని.. దాన్ని జనాలు ఎవరు లెక్కలోకి తీసుకోకుండా.. బన్నీ మొదటి సినిమా హిట్ “ఆర్య” అంటుంటారు. ఈ సినిమా విజయంతో ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ ట్యాగ్ అందుకున్న అల్లు అర్జున్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించిన “ఆర్య 2” మోస్ట్ స్టైలిష్ మూవీగా రిలీజ్ అయి ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. ఈ రెండు సినిమాల విజయంతో..అల్లు అర్జున్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. రెండూ కూడా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కడం తో అల్లుఅర్జున్ కెరియర్లో .. పెద్ద పాత్ర సుకుమార్ అని అభిమానులు అంటుంటారు.
దీంతో ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా మూడో సినిమా “పుష్ప” పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా మొట్టమొదటిసారి అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాలో గంధపు చెక్కల స్మగ్లర్ గా సుకుమార్ చూపిస్తున్నాడు. ఇదిలా ఉంటే బన్నీ సుకుమార్ సినిమా అంటే కచ్చితంగా సినిమాలో హైలెట్ అయ్యేది ఐటెం సాంగ్. ఆర్య సినిమా లో ఆ అంటే అమలాపురం, ఆర్య 2 సినిమాలో రింగ రింగా ఈ రెండు పాటలు కచ్చితంగా తెలుగు సినిమా ప్రేక్షకులు ఎవరు మర్చిపోలేనివి. ఇదిలా ఉంటే ఈ సారి కొత్త సినిమాలో కూడా ఇదే రేంజిలో పాట అందించడానికి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో సుకుమార్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
పాన్ ఇండియా తరహాలో సినిమా తెరకెక్కుతుండటంతో పాటు.. బన్నీ డైరెక్ట్ గా ఇతర మార్కెట్ లోకి లాంచ్ అవుతున్న నేపథ్యంలో.. అదరగొట్టే తరహాలో దేవి శ్రీ ప్రసాద్.. సాంగ్ డిజైన్ చేసినట్లు.. సినిమాకి గ్యారెంటీగా హైలెట్ అవుతున్నట్లు.. ఇండస్ట్రీ వర్గాలలో టాక్. ఇదిలా ఉంటే “పుష్ప” సినిమా టీజర్ ఆడియన్స్ పల్స్ రేట్ ఒక్కసారిగా పెంచడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో రికార్డులు సృష్టించింది. దీంతో పుష్ప సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో గతంలో కంటే ఇప్పుడు మరింతగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో పరిస్థితులు కరోనా కారణంగా దుర్భరంగా ఉండటంతో..పుష్ప సినిమా రిలీజ్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి.