Pushpa 2: సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ బన్నీ నటించిన పుష్పాగత ఏడాది అనేక రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. దేశంతో ప్రాంతంతో సంబంధం లేకుండా పాండమిక్ తో బిక్కుబిక్కుమంటున్న ప్రపంచంలో “పుష్ప” నవ్వులు పూయించింది. ఈ సినిమా చాలామంది సెలబ్రిటీలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులను మరియు క్రీడాకారులను ప్రభావితం చేసింది. ఈ సినిమాలో డైలాగులు మరియు పాటలు సోషల్ మీడియాలో అనేక రికార్డులు క్రియేట్ చేశాయి.

ఇప్పటికీ కూడా తగ్గేదేలే … “పుష్ప” మేనరిజమ్స్.. వీడియోలు పలువురు చేస్తూ వైరల్ అవుతున్నారు. ఇదంతా పక్కన పెడితే గత ఏడాది డిసెంబర్ నెలలో పుష్ప రిలీజ్ అయింది. సినిమా సూపర్ డూపర్ హిట్ కావటంతో ఎప్పటినుండో “పుష్ప 2” కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం విడుదలయ్యి 11 నెలలు అయినా గాని రెండో పార్ట్ ఇంకా మొదలు కాకపోవడం పై మండిపడుతున్నారు. ఇలాంటి తరుణంలో “పుష్ప 2” నుండి ఎటువంటి అప్డేట్స్ రాకుండా ఉండటంతో నిరాశలో ఉన్న బన్నీ అభిమానులకు … అల్లు అర్జున్ టీం సరికొత్త వార్త చెప్పడం జరిగింది.

పూర్తి విషయంలోకి వెళ్తే … అసలు “పుష్ప 2″ ఉందా లేదా అని ఓ అభిమాని బన్నీ టీంకి ట్వీట్ చేయటం జరిగిందట. దీనికి ” షూట్ ఈ నెల నుండి ప్రారంభం కానున్నట్లు.. రెండో వారంలోనే అప్ డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు… త్వరలో అన్ని విషయాలు తెలియజేస్తామని” బన్నీ టీం రిప్లై ఇవ్వటం జరిగిందట. దీంతో బన్నీ ఫాన్స్ “పుష్ప 2” నుండి ఎలాంటి అప్డేట్ వస్తుందో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఇటీవల సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చింది రష్మిక మందన. ఈ సందర్భంగా నేటిజెన్లు పలు ప్రశ్నలు వేశారు. ఎక్కడున్నారు అనే ప్రశ్నకు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాను. పుష్ప షూటింగ్ కోసం వచ్చాను అని.. తెలియజేయడం జరిగింది. నేను తాజా పరిణామాలు బట్టి చూస్తే “పుష్ప 2” రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయినట్లు అర్థమవుతుంది.