మెగా కాంపౌండ్ హీరోలలో ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా గత రెండు సంవత్సరాల నుండి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వరుణ్ తేజ్ సందడి మామూలుగా లేదు. మెయిన్ మెగా హీరోల సినిమాలు చాలావరకు రాకపోవటంతో పాటు వచ్చినా పెద్దగా ప్రేక్షకులను అలరించిన సినిమా పడలేదు. ఇలాంటి తరుణంలో వరుణ్ తేజ్ F1, గద్దలకొండ గణేష్ సినిమాలతో సూపర్ విషయాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలాఉండగా త్వరలో సాయి కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం వరుణ్ తేజ్ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినబడుతోంది.
పూర్తి మేటర్ లోకి వెళ్తే ఎఫ్ వన్ సినిమా లో విక్టరీ వెంకటేష్ తో నటించి విజయాన్ని సాధించాడు వరుణ్. అదే రీతిలో హరీష్ శంకర్ దర్శకత్వంలో గద్దల కొండ గణేష్ సినిమాలో కోలీవుడ్ యంగ్ హీరో అధర్వ మురళి తో కలిసి అదిరిపోయే సక్సెస్ సాధించాడు. ఇప్పుడు ఇదే రీతిగా సాయి కూరపాటి దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త సినిమా లో తనతో పాటు కన్నడ మెగాస్టార్ ఉపేంద్ర ని తీసుకోవడానికి వరుణ్ తేజ్ రెడీ అయినట్లు సమాచారం.
బాక్సింగ్ నేపథ్యంలో త్వరలో తెరకెక్కబోయే ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఇప్పటికే కండలు పెంచడం జరిగింది. ఆల్రెడీ లాక్ డౌన్ కి ముందే కొంత షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే త్వరలో సినిమా షూటింగ్ మొదలు కానున్న క్రమంలో ఈసారి ఉపేంద్ర పాల్గొన్నబోతున్నాట్లు టాక్. గతంలో ఉపేంద్ర బన్నీ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో విల్లన్ గా నటించడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమాలో కనిపించబోతున్నట్లు వార్త రావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.