NTR: నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో చాలామంది సెలబ్రిటీలు తారక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సినిమా టైటిల్ “దేవరా” అని ప్రకటించి… ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం సంచలనంగా మారింది. పోస్టర్ లో ఎన్టీఆర్ లుక్ చాలా వైల్డ్ గా ఉండటంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తారీఖు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ లో తేదీ ప్రకటించడం జరిగింది. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా కావటంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే నేడు 40వ పుట్టినరోజు నేపథ్యంలో ఎన్టీఆర్ కుటుంబంతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మే 20వ తారీకు అర్ధరాత్రి ఎన్టీఆర్ ఇంటి వద్ద అభిమానులు సందడి చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తారక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. “మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బావ” అని ట్వీట్ చేయడం జరిగింది. బన్నీ చెప్పిన విశేష్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గత నెలలో ఎన్టీఆర్… బన్నీ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ టైంలో పార్టీ లేదా పుష్ప అంటూ ఎన్టీఆర్ పెట్టిన ట్విట్ చాలా హైలైట్ గా నిలిచింది. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ మరియు బన్నీ ఇద్దరు బావ అని పిలుచుకుంటారు. ఇద్దరి మధ్య కూడా మంచి రాపో ఉంది. ఒకరంటే మరొకరికి గౌరవం కూడా. ఒకరి సినిమా విజయం సాధిస్తే మరొకరు సంతోషించే వ్యక్తిత్వం స్నేహం వీరిద్దరి మధ్య ఉంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు బన్నీ పెట్టిన ట్విట్ సంచలనంగా మారింది.