స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మురుగదాస్‌తో సినిమా చేయనున్నారా? అంటే అవుననే సమాధానం కోలీవుడ్‌లో వినపడుతుంది. ప్రస్తుతం రజనీకాంత్‌తో దర్బార్ సినిమాను తెరకెక్కిస్తున్న ఆయన తదుపరి తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమాను చేయాలనుకుంటున్నాడట. అలాగే మరోవైపు బన్నీ కూడా తమిళ ఎంట్రీ కోసం కాచుకుని కూర్చున్నాడు. బన్నీ కోసం నిర్మాతలు ఎలాగూ వస్తారు. తనకు తమిళం వచ్చు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. బడ్జెట్ విషయంలో కేర్ తీసుకుంటే అటు తమిళం, ఇటు తెలుగు మార్కెట్స్‌ను కవర్ చేసుకోవచ్చుననే ఉద్దేశంతో మురుగదాస్ ప్లానింగ్‌లో ఉన్నాడట. అయితే బన్నీ ఇప్పటికే ఫుల్ కమిట్మెంట్లో ఉన్నాడు. ఇంకా సుకుమార్ సినిమా, తర్వాత వేణు శ్రీరామ్ సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమాలను పక్కన పెట్టి, మురుగదాస్ సినిమాను చేయడానికి రెడీ అవుతాడా? అనేది ఆలోచించాల్సిన విషయం.
previous post
next post