33.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
Entertainment News సినిమా

RRR: “RRR” కి ఆస్కార్ రావటంపై భారత సినిమాకు హార్ట్ టచింగ్ మూమెంట్ అంటూ బన్నీ ట్వీట్..!!

Share

RRR: నిన్న “RRR” నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు రావడం తెలిసిందే. ఈ సినిమాతో పాటు ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే డాక్యుమెంటరీ చిత్రం కూడా ఆస్కార్ గెలుచుకుంది. ఈ క్రమంలో మొదటి నుండి ఆస్కార్ అవార్డు రేసులో “RRR” పేరు వినిపిస్తూ ఉండటంతో పాటు అవార్డు గెలుచుకోవడంతో చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు నిన్న మొత్తం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. “RRR” సినిమా యూనిట్ ఆస్కార్ గెలవడంతో తెలంగాణ ప్రభుత్వం.. చిత్ర బృందాన్ని సత్కరించడానికి కూడా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కాస్త లేటుగా ఐకాన్ స్టార్ బన్నీ అల్లు అర్జున్ ట్విట్టర్ లో స్పందించారు.

Bunny's tweet saying RRR getting Oscar is a heart touching moment for Indian cinema

“ఆస్కార్ వేదికపై నాటు నాటు పాట సత్తా చాటడాన్ని చూసి మనసు ఉపొంగిపోయిందని అల్లు అర్జున్ తెలియజేశారు. ఇది దేశానికి గొప్ప క్షణం అని పేర్కొన్నారు. “కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, రాహుల్, కాల భైరవలకు అభినందనలు. అలాగే తమ స్టెప్స్ తో ప్రపంచాన్ని డాన్స్ చేయించిన లవ్లీ బ్రదర్ రామ్ చరణ్, తారక్ లకు శుభాకాంక్షలు. ఆస్కార్ వెనుక రాజమౌళి కృషి ఎంతో ఉంది. భారత్ సినిమాకు ఇది హార్ట్ టచింగ్ మూమెంట్ అని సోషల్ మీడియాలో బన్నీ కామెంట్ చేయడం జరిగింది.

Bunny's tweet saying RRR getting Oscar is a heart touching moment for Indian cinema

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప 2” షూటింగ్ లో బన్నీ ఉన్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప మొదటి భాగం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆరీతిగానే.. పుష్ప సెకండ్ భాగం చిత్రీకరిస్తున్నారట. ఈ క్రమంలో ఫస్ట్ పార్ట్ కంటే రెండో భాగం ఎక్కువ భాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పుష్ప సెకండ్ పార్ట్ లో బాలీవుడ్ నటినటులు కూడా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో కొనసాగుతోంది.


Share

Related posts

ప్యాన్ ఇండియా మూవీగా మ‌రో ద‌క్షిణాది చిత్రం

Siva Prasad

Samantha: వామ్మో.. `ఖుషి` మూవీకి స‌మంత అన్ని కోట్లు డిమాండ్ చేసిందా?

kavya N

KGF 2: “కేజిఎఫ్ 2” లవర్స్ కి మరో గుడ్ న్యూస్..!!

sekhar