ఈసారి ప్రతీకారమేనట


తొలి చిత్రం ‘కేరాఫ్‌ కంచరపాలెం’తో దర్శకుడిగా సక్సెస్‌ను అందుకోవడమే కాదు. మంచి సినిమాను అందించిన దర్శకుడిగా మంచి క్రెడిట్‌ను కూడా సొంతం చేసుకున్నాడు డైరెక్టర్‌ వెంకట్‌ మహా. ప్రేమలోని నాలుగు కోణాలను తొలి చిత్రంలో ఆవిష్కరించిన ఈయన రెండో సినిమాను రివేంజ్‌ ఫార్ములాతోనే తెరకెక్కిస్తున్నాడట. అది కూడా రీమేక్‌ మూవీ. ఫహద్‌ ఫాజిల్‌ హీరోగా నటించిన మలయాళ చిత్రం ‘మహిషింటే ప్రతీకారం’ను తెలుగులో వెంకట్‌ మహా డైరెక్ట్‌ చేస్తున్న్నాడని సినీ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో ఫహద్‌ ఫాజిల్‌పాత్రలో సత్యదేవ్‌ నటిస్తున్నారట.