Samantha Naga Chaitanya: 2021లో సమంత నాగచైతన్య ఇద్దరు విడాకులు తీసుకోవడం తెలిసిందే. ప్రేమించి 2017లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగు సంవత్సరాలు పాటు చూడముచ్చటగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ జీవితాన్ని గడిపారు. సమంత నాగచైతన్య జంట ఇండస్ట్రీలో అందరూ చూడముచ్చటగా భావించేవాళ్ళు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో ఈ ఇద్దరు విడిపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ వీరిద్దరూ మల్లి కలవాలని అభిమానులు చాలామంది కోరుకుంటున్నారు. గత ఏడాది సమంత అనారోగ్య బారిన పడిన సమయంలో.. నాగచైతన్య వెళ్లి పలకరిస్తే బాగుంటుందని కొన్ని కోట్లమంది సోషల్ మీడియాలో మెసేజ్లు కూడా పెట్టారు. ఆ సమయంలో అక్కినేని అఖిల్ మాజీ వదిన సమంత పట్ల చాలా కేర్ తీసుకోవటం విశేషం.
పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు మరోసారి ఈ జంట కలవబోతున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. మేటర్ లోకి వెళ్తే విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో నాగచైతన్య ఫోటోలు డిలీట్ చేయడం తెలిసిందే. అయితే ఇప్పుడు అనూహ్యంగా అప్పటి పెళ్లి ఫోటోలు నాగచైతన్యతో హాలిడేలకు వెళ్లిన ఫోటోలు సమంత ఇంస్టాగ్రామ్ లో మళ్లీ ప్రత్యక్షమవ్వడంతో అసలు దీనికి అర్థమేంటి అని ప్రేక్షకులు సందేహంలో పడ్డారు. విడాకుల తర్వాత సామ్ వాటిని డిలీట్ చేసింది.బయటకు కనిపించకుండా ఆర్చివ్ లో పెట్టింది. కాగా మళ్లీ ఇన్‌స్టాలోకి రావడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
సమ్‌థింగ్ సంథింగ్ ఏదో జరుగుతుందని అంటున్నారు. మళ్లీ ఇద్దరూ కలవబోతున్నట్లు ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. ఇది కచ్చితంగా ఈ జంటను ప్రేమించే అభిమానులకు గుడ్ న్యూస్ అని ప్రచారం జరుగుతుంది. ఇటీవల కిలాడి నాగచైతన్య సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో సమంత కనిపిస్తే కచ్చితంగా మాట్లాడతానని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు సమంతా కూడా మాట్లాడటానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా నాగచైతన్యతో పెళ్లయిన సమయంలో తర్వాత దిగిన ఫోటోలు మరోసారి సమంత తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో రీ పోస్ట్ చేయడం సంచలనంగా మారింది.