సినిమా

వివాదం ముదురుతోంది..! ప్రభాస్ ‘ఆదిపురుష్’పై కోర్టులో కేసు..!!

case filed against prabhas adipurush
Share

గతంలో సినిమాలు విడదలయ్యాక ఏమైనా అభ్యంతరకర సన్నివేశాలుంటే వివాదం అయ్యేవి. ఇప్పుడు సినిమా టైటిల్స్, కాన్సెప్ట్స్ రివీల్ అవ్వగానే వివాదం అవుతున్నాయి. రేపు రిలీజ్ అనగా అజ్ఞాతవాసి, గద్దలకొండ గణేష్.. సినిమాలపై అభ్యంతరాలను అప్పటికప్పుడు పరిష్కరించారు. ఇవి సామాజిక కథలే అయినా మార్పులు తప్పలేదు. అయితే.. చారిత్రకం, చరిత్ర విషయాల్లో అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అటువంటి చిన్న తప్పిదమే ఇంకా షూటింగ్ మొదలుపెట్టని ఓ సినిమా వివాదంలో చిక్కుకోవడానికి కారణమైంది. ఆ సినిమానే ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’. ఇందుకు బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ కారణమయ్యాడు.

case filed against prabhas adipurush
case filed against prabhas adipurush

ఆమధ్య ముంబై మిర్రర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిపురుష్ గురించి మాట్లాడాడు సైఫ్. ‘ఈ సినిమాలో రావణుడిగా నటించడం సంతోషంగా ఉంది. సీతను రావణుడు ఎత్తుకెళ్లడాన్ని రావణుడి వైపు సానుభూతిగా చూపిస్తున్నాం. శూర్పణక ముక్కును లక్ష్మణుడు కోయడం వల్లే రావణుడు సీతాపహరణం జరిగింది అనే కోణంలో ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో.. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మరునాడే సైఫ్ ‘ఎవరి మనోభావాలు దెబ్బ తీయడం నా ఉద్దేశం కాదం’టూ క్షమాపణలు కూడా చెప్పాడు. దీంతో వివాదం ముగిసిందనే అనుకున్నారు అంతా. కానీ.. ఉత్తరప్రదేశ్ లోని జాన్ పూర్ లో హిమాన్షు శ్రీవాస్తవ అనే న్యాయవాది అడిషనల్ చీఫ్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు ఫైల్ చేశాడు.

హిందువుల మనోభావాలు, సెంటిమెంట్ ను అగౌరవపరిచేలా సైఫ్ వ్యాఖ్యలున్నాయని తన పిటిషన్ లో పేర్కొన్నాడు. తన పిటిషన్ లో సైఫ్ ఆలీఖాన్ పేరును, దర్శకుడు ఓమ్ రౌత్ పేర్లను పేర్కొన్నాడు. కేసును స్వీకరించిన కోర్టు ఈనెల 23కు వాయిదా వేసింది. దీంతో ఈ అంశంపై మరోసారి వివాదం చెలరేగింది. ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో రావణుడిగా సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నాడు. ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఈ సినిమాను టీసిరీస్ సంస్థ భారీ నిర్మాణ వ్యవయంతో తెరకెక్కించనుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.


Share

Related posts

మ‌హేష్ బాట‌లో ఎన్టీఆర్‌…

Siva Prasad

Jagapathi babu : జగపతిబాబు బయటకు కనిపించే అంత సాఫ్ట్ కాదు… అతనిలో మరో యాంగిల్ కూడా ఉంది.. జగపతి బాబు గురించి డార్క్ సీక్రెట్స్..!

Teja

తిరుమ‌ల కొండ‌కు స‌మంత

Siva Prasad