Entertainment News సినిమా

పవన్ కళ్యాణ్ ఆత్మహత్యకు పాల్పడ్డ సందర్భం..!!

Pawan Kalyan committing suicide Incident
Share

నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయన అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు సినిమా రంగంలో ఉన్న టాప్ హీరోలు అందరికంటే భారీ క్రేజ్ కలిగిన హీరోలలో పవన్ ఒకరు. దాదాపు మూడు సంవత్సరాల పాటు సినిమాలు చేయకపోయినా గాని ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా.. ఉంది అంటే ఆయన సత్తా ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక పక్క రాజకీయాలు మరోపక్క సినిమా రంగంలో విజయవంతంగా రాణిస్తున్న పవన్.. సమాజంపై విభిన్నమైన ఆలోచన ధోరణితో వ్యవహరిస్తూ ఉంటారు. చాలావరకు పవన్ కళ్యాణ్ బాల్యంలో మరియు యవ్వన వయసులో ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని సమాజంపై తనకంటూ బాధ్యతను ఏర్పరచుకొని అనేక రకాలుగా చాలామందికి ఉపయోగపడుతూ ఉంటారు. ఎంతోమంది యువతను ప్రభావితం చేసే పవన్ కళ్యాణ్.. ఒకానొక సందర్భంలో ఆత్మహత్య కూడా చేసుకోవడానికి పాల్పడిన సందర్భం ఉంది.

Case of Pawan Kalyan committing suicide..!!

ఈ విషయాన్ని ఒకానొక స్వయంగా పవన్ కళ్యాణ్ యే ఇంటర్వ్యూలో తెలియజేశారు. “స్నేహితులు ఎక్కువగా ఉండేవారు కాదు. ఉన్న ఒకరిద్దరితో ఆలోచనలు సరిగ్గా కలిసేవి కావు. ఎనిమిదవ తరగతి నుండి పరీక్షల్లో ఫెయిల్ అయ్యే అలవాటు ఉండటంతో.. ఇంటర్ ఫెయిల్ అయినా పెద్దగా బాధపడలేదు. స్నేహితులంతా జీవితంలో ముందుకు వెళ్ళిపోతున్నారన నిస్పృహ ఎక్కువగా వెంటాడేది. ఆ సమయంలోనే ఆత్మహత్యకు ప్రయత్నించా. కుటుంబ సభ్యులు చూడటంతో బతికా. అప్పుడు అన్నయ్యలు వదిన సురేఖ అండగా నిలిచారు అని పవన్ చెప్పుకోచ్చారు.

Case of Pawan Kalyan committing suicide..!!

జీవితంలో ఎన్నో విజయాలు చూసిన పవన్ సైతం.. సామాన్య మానవుడి మాదిరిగా ఈ తరహాలో… అపజయాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడటం అనే నిర్ణయం తీసుకోవడం.. వార్త తాజాగా బయటపడి సంచలనం సృష్టించింది. ఇక ఇదే సందర్భంలో ఒకప్పుడు జీవితంలో పరాజయం చూసిన వ్యక్తి ఆత్మహత్యదాక వెళ్లి కూడా తిరిగి బతికి బయటపడి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకోవడం నిజంగా గ్రేట్ అని చెప్పవచ్చు. ఒక అస్పష్టతలో..పరాజయాలలో  నుండి బయటపడి స్పష్టమైన జీవితాన్ని జీవిస్తూ చాలామంది యువతను ప్రభావితం చేస్తున్న పవన్ కళ్యాణ్.. నేడు పుట్టినరోజు కావటంతో చాలామంది సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు ఆయనకు విషెస్ తెలియజేస్తూ ఉన్నారు.


Share

Related posts

ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిన ప్రభాస్..!!

sekhar

అతను కనీసం రోజుకి రెండు మూడు పెగ్గులు వేస్తాడు..! ఆ ఆర్టిస్ట్ పై నాగబాబు సంచలన కామెంట్స్

arun kanna

Maestro : “మాస్ట్రో” మీద అంచనాలు పెంచుతున్న నితిన్..వీడియో సాంగ్ సూపర్ అంటూ టాక్

GRK