కొత్త కుంప‌టి

Share

అస‌లే పెళ్ల‌యి ఏడాది దాటేసింది. ఆ శుభ‌వార్త గానీ చెప్పేస్తున్నారా.. వావ్‌. అని అనుకుంటున్నారా.. అయితే త‌ప్పులో కాలేసిన‌ట్టే. కాస్త అగండి. స‌మంత‌- చైత‌న్య విడివిడిగా ఇద్ద‌రు. క‌లిస్తే ఒక్క‌రు కావ‌చ్చు. కానీ వారు మొద‌లుపెట్ట‌బోయే నిర్మాణ సంస్థ మాత్రం ఆ కాంపౌండ్‌లో మూడోదే. ఆల్రెడీ అన్న‌పూర్ణ స్టూడియోస్ ఉంది. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్ మీద కూడా సినిమాలు తీస్తున్నారు. తాజాగా ముచ్చ‌ట‌గా కేవ‌లం స‌మంత‌, నాగ‌చైత‌న్య మాత్రం క‌లిసి ఓ నిర్మాణ సంస్థ‌ను మొద‌లుపెట్టాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. నాగ‌చైత‌న్య‌కు ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్ బాగా తెలుసు. ఇన్‌ఫ్యాక్ట్ అన్న‌పూర్ణ‌లో కొన్ని సినిమాల నిర్మాణాన్ని కూడా ఆయ‌న ద‌గ్గ‌రే ఉండి చూశారు. స‌మంత‌కు స్క్రిప్ట్ జ‌డ్జిమెంట్ ఉంటుంది. సో ఇద్ద‌రు క‌లిసి తాము న‌టించినా, న‌టించ‌క‌పోయినా చిన్న సినిమాల‌ను ప్రొడ్యూస్ చేయాల‌ని అనుకుంటున్నారట‌. అన్న‌పూర్ణ స్టూడియోస్ అక్కినేని ఫ్యామిలీ క‌న్‌స‌ర్న్ బ్యాన‌ర్‌.కాగా మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్ ఒన్లీ నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌, అఖిల్‌కు సంబంధించిన సంస్థ‌. సో ఇప్పుడు సిద్ధ‌మ‌వుతున్న మూడో సంస్థ ఒన్లీ పెద్ద‌బ్బాయి, పెద్ద‌కోడ‌లుకు సంబంధించింది అవుతుంది. అన్ని విష‌యాల‌నూ వెంట వెంట‌నే సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసే స‌మంత‌.. ఈ విష‌యాన్ని ఎప్పుడు పోస్ట్ చేస్తారా అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రూ త‌మ త‌మ చిత్రాల‌తో బిజీగా ఉన్నారు.


Share

Related posts

Meghali Joshful Looks

Gallery Desk

Sharwanand : శర్వానంద్ ఆశలన్నీ మహా సముద్రం మీదే..?

GRK

నాగ‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తా…

Siva Prasad

Leave a Comment