అతని ముచ్చటైన అల్లరి మాటలతో కామెడీని పండిస్తూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతూ మంచి అవకాశాలను దక్కించుకుంటున్న వ్యక్తి చలాకీ చంటి. చాలాకీ చంటి పేరు వినగానే జబర్దస్త్ గుర్తొస్తూ ఉంటుంది. ఈ షోలో చలాకీ చంటి పండించిన కామెడీతో ఎంతో మంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు. కాగా ఈ షో చేసే వారి కేరేర్ కు మంచి ప్లాట్ ఫాంగా మరిందనే చెప్పుకోవచ్చు. అలాగే చంటికి కూడా జబర్దస్త్ మంచి మంచి అవకాశాలను అందించిందనే చెప్పుకోవచ్చు.. అలాగే బిగ్ బాస్ 3 లో హౌస్ మేట్ గా అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న వ్యక్తి హిమజ.
ఆమె అంతకు ముందు సీరియల్లో నటించారు కూడా. చంటి మరియు హిమజలు ఆలీతో జాలీగా అనే కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ షో లో వారిరువురి గురించి పలు ఆసక్తి గల విషయాలను బయటపెట్టారు అలీ. మరీ ఆలీతో వారిరువురు పంచుకున్న విషయాలను మనం కూడా తెలుసుకుందామా.. మరింకెందుకు ఆలస్యం.. చాలాకీ చంటి ఆలీకి ఏం విషయాలు చెప్పాడో చదివేయండి.. నా అసలు పేరు వినయ్ మోహన్. నేను రేడియో స్టేషన్ వర్క్ చేస్తున్నప్పుడే నన్ను చంటి అనేవారు. నటి ఊహ గారి మూలంగా గౌరవం ఎలా ఇస్తారనేది తెలుసుకున్నా. అందుకే మెల్లిమెల్లిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా.
2008 లో జల్లు చిత్రం ద్వారా వెండితెరకు పరియమయ్యాను. కాని అది నాకు ఏ మాత్రం గుర్తింపు తేలేదు. దాని తర్వాత ఒక ఏదాడి తర్వాత భీమిలి కబడ్డీ జట్టులో నటించడానికి అవకాశం వచ్చింది. అందులో నాకు మంచి గుర్తింపే వచ్చింది. కాని కొందరి మూలంగా నాకు మళ్లీ సినిమాల్లో అవకాశాలు తగ్గాయి. నా మీద చేసిన అసత్య ప్రచారం మూలంగా 16 సినిమాల్లో నాకు అవకాశం లభించలేదు. నేను ప్రేమ వివాహం చేసుకున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. నా మొదటి కూతురు పుట్టినప్పుడూ చాలా ఏడ్చాను.. మళ్లీ నా తల్లి నాకు తిరిగొచ్చిందనే సంతోషంలో ఏడ్చాను.
హిమజ: భార్యామని ధారావాహిక ద్వారా నానే బుల్లితెరకు పరిచయమయ్యాను. మాది గుంటూరు జిల్లాలోని వీర్లపాలెం. డిగ్రీ కంప్లీట్ చేసి కొన్ని రోజులు సోషల్ టీచర్ గా స్కూల్లో వర్క్ చేశాను. కాని సంపాదన సరిపోకా సాప్ట్ వేర్ ప్రోగ్రామ్స్ నేర్చుకున్నాను. అలాంటి టైంలో నేను ఇండస్ట్రీకి రావాలన్న కోరిక కలిగింది. పెళ్లి గురించి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. చేసుకోకపోతేనే బెటర్ అనిపిస్తుంది. 2013 లో భార్యామణి ధారావాహిక ద్వారా బుల్లితెరకు పరియమైన నేను శైలజ సినిమాతో వెండితెరకు కూడా పరిచయమయ్యాను. సీరియల్స్ లో నా ఉత్తమ ప్రతిభ వల్ల ఉత్తమ నటిగా కూడా అవార్డు పొందాను.