NewsOrbit
Entertainment News సినిమా

Chandramohan: ఎన్టీఆర్ తోనే గొడవకు దిగిన చంద్రమోహన్.. సంచలన ఘటన..!!

Share

Chandramohan: తెలుగు చలనచిత్ర రంగంలో సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణ వార్త అందరిని కలిచి వేసింది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధాని మంత్రి సైతం చంద్రమోహన్ మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. చలనచిత్ర రంగంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి అనేకమందిని మెప్పించి.. మంచి గుర్తింపు పొందుకున్న నటుడు. కొత్తలో హీరోగా కూడా కొన్ని సినిమాలు చేయడం జరిగింది. ఈ క్రమంలో సీనియర్ ఎన్టీఆర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ఆయనకి . చంద్రమోహన్ కి మధ్య ఓ వివాదం నెలకొంది. మామూలుగానే ఇండస్ట్రీలో చంద్రమోహన్ ఓ సామ్యుడు ఎవరి జోలికి వెళ్లే వ్యక్తి కాదు. అటువంటిది ఏకంగా స్టార్ హీరోగా రాణిస్తున్న ఎన్టీఆర్ తో కొంత గరుకుగా వ్యవహరించారట.

Chandramohan got into a fight with NTR who is in form at that time

ఎన్టీఆర్ ఆహ్వానాన్ని తిరస్కరించి అప్పట్లో చంద్రమోహన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు. మేటర్ లోకి వెళ్తే 1975లో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఎస్డీలాల్ దర్శకత్వంలో “అన్నదమ్ముల అనుబంధం” చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సోదరులుగా మొదట మురళీమోహన్, చంద్రమోహన్ ను అనుకున్నారట. అంతా ఓకే అయిన క్రమంలో 15రోజులు పాటు.. పాత్రకు సంబంధించి చంద్రమోహన్ తో రీహార్సులు కూడా చేయించారట. కానీ షూటింగ్ కు రెండు రోజులు ముందు ఎన్టీఆర్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చంద్రమోహన్ ని ఆ సినిమా నుండి తప్పించి .. ఆ పాత్రలో బాలకృష్ణని పెట్టారట.

Chandramohan got into a fight with NTR who is in form at that time

అయితే ఈ విషయం తెలియక చంద్రమోహన్ షూటింగ్ కి వెళ్ళగా అక్కడ ఎవరు పట్టించుకోలేదట. పైగా తాను చేయాల్సిన పాత్ర బాలకృష్ణ చేస్తున్నారని చూసి చంద్రమోహన్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీంతో ఎన్టీఆర్ తన తరఫున ఇద్దరు వ్యక్తులను చంద్రమోహన్ దగ్గరికి పంపించి.. అన్నగారు ఇంకో సినిమాలో మీకు అవకాశం ఇస్తారు అని సర్ది చెప్పే ప్రయత్నం చేశారట. అయితే చంద్రమోహన్ మాత్రం కోపంతో ఎవరికి కావాలి మీ అన్నగారి అవకాశాలు. తోటి నటీనటులను గౌరవించలేని ఆయన సినిమాల్లో నేను నటించడానికి సిద్ధంగా లేను అని.. ఎన్టీఆర్ ఆహ్వానాన్ని చంద్రమోహన్ ధైర్యంగా తిరస్కరించారట. ఆ సమయంలో ఈ ఘటన సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని చంద్రమోహన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ప్రేక్షకులతో పంచుకున్నారు.


Share

Related posts

నా కెరీర్‌లో మ‌ర‌చిపోలేని చిత్రం – నాని

Siva Prasad

Prashanth Neel-Nani: `కేజీఎఫ్‌` డైరెక్ట‌ర్‌తో నానినా..? అదే నిజ‌మైతే అంద‌రికీ మైండ్‌బ్లాకే!

kavya N

Radhe Shyam: అప్పుడే ఓటిటి లోకి “రాధేశ్యాం”..??

sekhar