సినిమా

RC 15: చరణ్ సినిమాకి సంబంధించిన చిన్న చేంజ్ చేసిన డైరెక్టర్ శంకర్..!!

Share

RC 15: సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. మొన్నటిదాకా సినిమాకి సంబంధించిన షూటింగ్ రాజమండ్రిలో జరగగా ఇప్పుడు నార్త్ ఇండియాలో పంజాబ్ రాష్ట్రంలో జరుగుతుంది.

Kiara Advani joins Ram Charan starrer 'RC 15', movie to get Pan India  release

దాదాపు 30 శాతానికి పైగానే షూటింగ్ కంప్లీట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో సినిమా మధ్యలో ఉండగా డైరెక్టర్ శంకర్ చిన్న మార్పు చేసినట్లు సమాచారం. విషయంలోకి వెళితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి సినిమాటోగ్రాఫర్ నీ డైరెక్టర్ శంకర్ మార్చేయడం జరిగిందట. అమృత్సర్ షెడ్యూల్ లో రత్నవేలు తో… శంకర్ పని చేయడం జరిగింది. అయితే ఇప్పుడు పంజాబ్లో షెడ్యూల్ కంప్లీట్ కావడంతో రత్నవేలు స్థానంలో తిరునవ్వుకరసు నీ… మళ్లీ శంకర్ పిలిచినట్లు… త్వరలో హైదరాబాద్ లో మరో షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.

Ram Charan's double dhamaka in RC15 - TeluguBulletin.com

ఈ సినిమాలో చరణ్ సరసన హీరోయిన్ పాత్రలో కియారా అద్వానీ నటిస్తోంది. దాదాపు మూడు విభిన్నమైన పాత్రల్లో చరణ్ నీ  శంకర్ సరికొత్తగా చూపించానున్నారట. ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఫోటోలు షూటింగ్ జరుగుతుండగా… సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యాయి. దాన్ని బట్టి చూస్తే ఒక రాజకీయ నేపథ్యం కలిగిన సినిమా అని క్లియర్ కట్ గా అర్థం అవుతోంది. ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందు చరణ్ ముఖ్యమంత్రి పాత్రలో కూడా కనిపిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ దిశగానే షూటింగ్ జరుగుతూ ఉండటంతో… ఈ సినిమాపై మెగా అభిమానులకు భారీగా ఆసక్తి నెలకొంది.


Share

Related posts

Avantika Mishra Cute Looks

Gallery Desk

స్టార్ హీరోలు కూడా చేయ‌లేదు…

Siva Prasad

నాగార్జున అందుకు ఒప్పుకుంటాడా.. బయోపిక్ అని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar