Ram Charan: నేడు తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది మెగా కోడలు ఉపాసన. సోమవారం రాత్రి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో డెలివరీ కి జాయిన్ అయిన ఉపాసన మంగళవారం ఉదయం ఆడబిడ్డకు జన్మనివ్వడం జరిగింది. దీంతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటే అయింది. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆసుపత్రి ఓ ప్రకటన విడుదల చేయడంతో.. అటు మెగా ఇటు కామినేని కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. మొట్టమొదటిసారి కూతురిని చూసి చరణ్ మురిసిపోయారని ఆయన సన్నిహితులు తెలియజేయడం జరిగింది. మెగా ప్రిన్సెస్ పుట్టింది అంటూ మెగా ఫ్యామిలీ ప్రకటన విడుదల చేయడం జరిగింది.
దీంతో తమ అభిమానం నటుడు తండ్రి కావటంతో అపోలో ఆసుపత్రి వద్ద అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అంతేకాదు మెగా ప్రిన్సెస్ వచ్చిందంటూ ఆసుపత్రి చుట్టుప్రక్కల భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది అభిమానుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే సమయంలో విదేశాల నుంచి సైతం అభిమానులు చరణ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఉపాసన ఆడపిల్లకు జన్మనివ్వడంతో జపాన్ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ విష్ చేస్తున్నారు. రామ్ చరణ్ కి జపాన్ లో విపరీతమైన అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. చెర్రీ సినిమాలో అక్కడ విపరీతమైన ఆదరణ దక్కించుకున్నాయి.
అంతేకాదు ఉపాసన ప్రెగ్నెంట్ అవటానికి జపాన్ దేశానికి ప్రత్యేకమైన అనుబంధం ఉందని గతంలో తెలియజేయడం జరిగింది. జపాన్ తనకు స్పెషల్ అంటూ కూడా గతంలో ట్వీట్ చేశారు. ఈ క్రమంలో దేశ విదేశాల నుంచి రామ్ చరణ్ దంపతులకు ప్రముఖులు మరియు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మెగా కుటుంబ సభ్యులు.. మెగా వారసురాలికి స్వాగతం పలకడానికి భారీ ఎత్తున గిఫ్ట్ లు తీసుకొస్తూ ఆసుపత్రి వద్దకు చేరుకుంటూ ఉన్నారు. చరణ్.. ఉపాసనకి 2012వ సంవత్సరంలో వివాహం జరగగా పది సంవత్సరాలు తర్వాత.. బిడ్డ పుట్టడంతో ఇరు కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఈ క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు.