RRR: అంతర్జాతీయ స్థాయిలో “RRR” జోరు ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పైగా ఈ సినిమా ఆస్కార్ రేసులో ఉండటంతో… భారతీయ సినిమా ప్రేమికులు గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. గత ఏడాది మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా దాదాపు ₹1000 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన తరువాత మంచి క్రేజ్ దక్కించుకుంది. ఈ సినిమాతో రాజమౌళి ఇద్దరు హీరోల దిశ దశ ఒక్కసారిగా మారిపోయాయి. “RRR” కంటే బాహుబలి పెద్ద హిట్ అయినా గాని ఈ సినిమాతోనే… ప్రపంచ సినిమా రంగంలో జక్కన్న కి మంచి గుర్తింపు లభించింది. ప్రపంచ జగ్గజ దర్శకులు రాజమౌళి పనితనాన్ని ప్రశంసించారు. అనేక అంతర్జాతీయ అవార్డులు కూడా ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది.
ప్రపంచ సినిమా రంగంలో పేరుగాంచిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా “RRR” దక్కించుకుంది. దీంతో కచ్చితంగా ఆస్కార్ అవార్డు వస్తుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా ఉంటే ఈ సినిమా స్పెషల్ షో ఇటీవల అమెరికాలో వేశారు. లాస్ ఏంజిల్స్ వరల్డ్ బిగ్ స్క్రీన్ పై స్క్రీనింగ్ చేయడం జరిగింది. అయితే ఈ స్పెషల్ షో కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో పాటు డైరెక్టర్ రాజమౌళి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ… ప్రేక్షకులు చూపించే ప్రేమ మరియు అభిమానాలు ఆదరణ తన కెరియర్లో ఎప్పుడు మర్చిపోలేనని సుదీర్ఘ తీరాలకు నడిపిస్తుందని తెలిపారు. మిగిలిన వాళ్లకు కూడా ఇలాగే ఉంటుందా లేకపోతే నాకు మాత్రమే ఇలా ఉందో నాకు అర్థం కావటం లేదు. కానీ నటుడిగా ఈ క్షణాలను మనస్పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. ఈ క్షణాల కోసమే ఎంత కష్టమైనా పడ్డాను. ప్రేక్షకులు అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయాలన్నదే నా ప్రయత్నం.
ఇలాంటి స్పందనే నేను కోరుకోవడం జరిగింది. “మగధీర” చేస్తున్న సమయంలో నన్ను నేను ఒక విద్యార్థిగా భావించాను. “RRR” చేస్తున్నప్పుడు కూడా అదే ఫీలయ్యాను. ఇదేదో నేను సరదాగా మాట్లాడటం లేదు. రాజమౌళి గారు నాకు ఒక ప్రిన్సిపాల్ మరియు టీచర్. ఒక మాటలో చెప్పాలంటే ఆయన నాకు ఒక గురువు లాంటి వారు. ఆయనను కలిసిన ప్రతిసారి… సినిమాకి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకుంటాను. ఆయనతో మాట్లాడితే ఎంతో నాలెడ్జ్ వస్తుంది. పదేళ్లకు సరిపడ జ్ఞానం మరియు తెలివితేటలు పెరుగుతాయి. ఇక తారక్ నా బెస్ట్ ఫ్రెండ్. ఇందుకుగాను “RRR” కీ ధన్యవాదాలు. ఈ సినిమా వాళ్ళ మేం తరచూ కలవడం వల్ల సన్నిహితులైన. ఈ సినిమాలో తారక్ నటించినవల్ల సోదరా భావం చూపించడం చాలా తేలికయ్యింది. ఈ వేదిక మీద తారక్ నీ మిస్ అవుతున్నాను అంటూ రాంచరణ్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. చరణ్ స్పీచ్ కీ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు ఫిదా అయ్యారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!