33.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Ram Charan Tej: అమెరికా షో ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తో బాండింగ్ గురించి చరణ్.. సంచలన వ్యాఖ్యలు..!!

Share

Ram Charan Tej: “గుడ్ మార్నింగ్ అమెరికా” అనే షోలో చరణ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలు “RRR” గురించి దర్శకుడు రాజమౌళి గురించి అనేక విషయాలు పంచుకున్నారు. ఎన్టీఆర్ తో తనకున్న స్పెషల్ బాండింగ్ గురించి సరికొత్త విషయాన్ని చరణ్ తెలియజేయడం జరిగింది. తను తండ్రి అయిన విషయాన్ని మొదట సోషల్ మీడియాలో కంటే తారక్ కీ ఫోన్ చేసి ఆనందాన్ని షేర్ చేసుకున్నట్లు చరణ్ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ తాను బెస్ట్ ఫ్రెండ్స్ అని… అన్ని విషయాలు గురించి తనతో షేర్ చేసుకుంటానని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మెగా కుటుంబంలో మరో వ్యక్తి రాబోతున్నందుకు తన తల్లిదండ్రులు ఎంతగానో సంతోషంగా ఉన్నట్లు చరణ్ తెలియజేశారు.

Charan made sensational comments about bonding with NTR in an American show interview

రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్ కు ప్రజెంటర్ గా చరణ్ వ్యవహరించనున్నారు. రేపు జరగనున్న ఈ వేడుకలో ఒక విజేతకు రామ్ చరణ్ చేతుల మీదుగా అవార్డు అందజేయనున్నారు. ఇటువంటి తరుణంలో “గుడ్ మార్నింగ్ అమెరికా” అనే టాకీ షోలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే వచ్చే నెలలో ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జరగనుంది. “RRR”లో నాటు నాటు సాంగ్ పోటీలో ఉంది. అందరూ అవార్డు రావాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ సాంగ్ కీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలవడంతో గ్యారంటీగా ఆస్కార్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. “RRR” ఆస్కార్ గెలిస్తే ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమొగుతుంది.

Charan made sensational comments about bonding with NTR in an American show interview

ఇదిలా ఉంటే ప్రస్తుతం చరణ్.. శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఇది చరణ్ కెరియర్ లో 15వ సినిమా. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. మొన్నటిదాకా సరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకి ప్రస్తుతం గ్యాప్ ఇచ్చి.. చరణ్ అమెరికాలో అవార్డుల వేడుకలలో బిజీబిజీగా గడుపుతున్నారు.


Share

Related posts

Krithi Shetty: చిట్టి న‌డుమును చూపిస్తూ కృతి శెట్టి పోజులు.. ఫొటోలు చూస్తే మైండ్‌బ్లాక్ అంతే!

kavya N

ఈ వారం ఓటీటీ, థియేటర్ లో విడుదల అయ్యే టాప్ సినిమాలు ఇవే..

Ram

Pawan kalyan 28 : పవన్ కళ్యాణ్ 28లో ప్రకాశ్ రాజ్..

GRK