సినిమా

Ram Charantej: భలే గమ్మత్తు..ఒకేరోజు రాంచరణ్ హిట్, ఫ్లాప్ సినిమాలు..!!

Share

Ram Charantej: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మంచి క్రేజ్ తో దూసుకు పోతున్నాడు. చిరంజీవి నట వారసుడిగా సినిమా ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ సెపరేట్ ఇమేజ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో ప్రపంచంలో క్రియేట్ చేసు కుంటూ.. బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టిస్తున్నాడు. నటనలో, డాన్సుల్లో తండ్రి చిరంజీవి మాదిరి వైవిధ్యం ప్రదర్శిస్తూ.. ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంటున్నాడు. కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ  హీరో సాధించని రీతిలో మూడు ఇండస్ట్రీ హిట్ లు చరణ్ సొంతం చేసుకున్నాడు.

charan's biggest hit and flop to stream on same day

మగధీర, రంగస్థలం లేటెస్ట్ గా “RRR” తో… మూడు తిరుగులేని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. “RRR”తో అయితే 1000 కోట్ల మార్క్ ను అందుకున్న హీరో గా నిలిచాడు. ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకా మిగతా చోట్ల చరణ్ కి మంచి మార్కెట్ క్రియేట్ అయింది. ఉత్తరాది ప్రేక్షకులు చరణ్ పాత్ర కి బాగా కనెక్ట్ అయ్యారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు రామ్ చరణ్ నటించిన ఒక హిట్టు మరియు ఫ్లాప్ సినిమా ఒకే రోజు విడుదల అవుతున్నాయి. క్లియర్ కట్ మేటర్ లోకి వెళ్తే చరణ్ రీసెంట్ హిట్ “RRR”.. అదేవిధంగా చిరంజీవితో కలసి కీ రోల్ ప్లే చేసిన ఫ్లాప్ “ఆచార్య”.. రెండూ కూడా ఓటిటిలో ఒకే రోజు విడుదల అవుతున్నాయి.

 

మే 20వ తారీకు “RRR” జీ5 లో.. ఆచార్య అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వార్త తెలుసుకుని మెగా ఫ్యాన్స్ భలే గమ్మత్తుగా ఒకేరోజు చరణ్ ఫ్లాప్.. హిట్ వస్తున్నాయి అని కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చరణ్ పాన్ ఇండియా భారీ ప్రాజెక్ట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే నవంబర్ మాసంలో విడుదలయ్యే రీతిలో సినిమా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్.


Share

Related posts

సుమ కాపురంలో చిచ్చు పెట్టిన బిగ్ బాస్ విన్నర్..! షో మధ్యలోనే రాజీవ్ కనకాల పై కోపం…

arun kanna

Devatha Serial: దేవి కోరికను ఆఫీసర్ సార్ తీరుస్తాడా.!?

bharani jella

ఆ డైరెక్టర్ తో సినిమా సంతకం పెట్టద్దు ఎన్‌టి‌ఆర్ అన్నా .. ప్లీజ్ ‘ ఫాన్స్ గోల గోల !

GRK