Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జూన్ 20వ తారీకు ఆడపిల్ల జన్మించటం తెలిసిందే. పెళ్లయిన 11 సంవత్సరాల తర్వాత మొదటి సంతానం అందులోనూ ఆడపిల్ల కావటంతో చరణ్ ఫుల్ సంతోషంగా ఉన్నారంట. పైగా మంచి గడియాలలో కొట్టడంతో పాటు.. మహా జాతకురాలు అని పండితులు అనటంతో గర్భంలోనే బేబీ ఉన్న సమయంలో మెగా కుటుంబంలో చాలా శుభకార్యాలు జరగటంతో.. కూతురు చాలా అదృష్టవంతురాలుగా తండ్రి చరణ్ భావిస్తున్నారట. దీంతో దాదాపు లక్ష మంది అనాధలకు దాదాపు 85 రకాల వంటకాలతో అన్నదానం చేయడానికి ఏర్పాటు చేస్తున్నారట.
ఇదే సమయంలో ఇంట్లో పని చేసే అందరి పని వాళ్ళకి బోనస్ లు కూడా ప్రకటించారని సమాచారం. పాప జాతకంలో రాజయోగం ఉట్టి పడుతూ ఉండటంతో… చరణ్ అనేక మంచి కార్యక్రమాలు చేయటానికి ముందుకు వస్తున్నారట. మెగా కుటుంబంలో పాప పుట్టుకతో గత రెండు రోజుల నుండి సంబరాలు స్టార్ట్ అయ్యాయి. మనవరాలు కొట్టడంతో చిరంజీవి సైతం చాలా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఆ బిడ్డ గర్భంలో ఉన్న సమయంలోనే కుటుంబంలో ఎన్నో శుభకార్యాలు జరగటంతో పాటు చరణ్ కెరియర్ పరంగా గ్లోబల్ స్థాయిలో సత్తా చాటటం జరిగిందని ఇది నిజంగా శుభ ఘడియలు అని అన్నారు.
ఇదిలా ఉంటే మరో నెల 15 రోజులపాటు సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వాలని చరణ్ డిసైడ్ అయ్యారట. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చరణ్ చేస్తున్న “గేమ్ చేంజర్” సినిమా షూటింగ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఇది మరో నెలపాటు కొనసాగించాలని.. పాప దగ్గర ఉండాలని చరణ్ డిసైడ్ అయ్యారంట. ఆగస్టు నెల నుండి మళ్లీ సినిమా షూటింగ్స్ లో జాయిన్ అవ్వడానికి అంతలోపు బేబీ దగ్గరే చరణ్ ఉండబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇండస్ట్రీ మొత్తానికి చరణ్ బిగ్ పార్టీ ఇవ్వనున్నట్లు టాక్ నడుస్తోంది.