25.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Mahesh Rajamouli: “మహేష్.. రాజమౌళి” ప్రాజెక్టుపై అమెరికా షోలో చరణ్ సంచలన కామెంట్స్ వీడియో వైరల్..!!

Share

Mahesh Rajamouli: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అమెరికాలో ఓ ప్రముఖ సోలా పాల్గొన్నారు. “గుడ్ మార్నింగ్ అమెరికా” అనే ఈ షోలో చరణ్ “RRR” గురించి ఇంకా తన వ్యక్తిగత విషయాల గురించి రాజమౌళి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. జక్కన్న నీ ఇండియన్ స్టీఫెన్ స్పిల్ బర్గ్ అంటూ అభివర్ణించారు. ఈ రీతిగానే రాజమౌళి చేయబోయే నెక్స్ట్ సినిమా గ్లోబల్ సినిమా దిశగా తియబోతున్నట్లు…ఆ దిశగా ఆయన ప్రయాణం ఉండబోతుందని చరణ్ తెలియజేశారు. దీంతో నెక్స్ట్ రాజమౌళి చేయబోయేది మహేష్ సినిమా కావటంతో… ఈ ప్రాజెక్టు గ్లోబల్ సినిమా అని చరణ్ పరోక్షంగా ఈ షోలో బయటపెట్టారు.

Charan's sensational comments on Mahesh Rajamouli's project in American show

మరోపక్క ఈ ప్రాజెక్టు దాదాపు 30 భాషలలో తెరకెక్కతున్నట్లు ఇటీవల ప్రచారం జరుగుతూ ఉంది. హాలీవుడ్ నిర్మాణ సంస్థలు కూడా చేతులు కలుపుతున్నట్లు…. ₹1000 కోట్ల భారీ బడ్జెట్ తో మహేష్ మూవీని రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రాజమౌళి గొప్పతనం గురించి మాట్లాడుతూ ఆయన చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ గ్లోబల్ సినిమా దిశగా వెళుతుందని చరణ్ ఈ షోలో చెప్పటం సంచలనంగా మారింది. ఇంక ఈ షోలో తన వ్యక్తిగత విషయలు ..తండ్రి అవటంపై చరణ్ ఎంతగానో సంతోషం వ్యక్తం చేశారు. ఇండియన్ సినిమా ప్రపంచ స్థాయిలో మరింతగా రాణించబోతుందని పేర్కొన్నారు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే రాబోయే రోజుల్లో ఇండియన్ సినిమాలు… మరింతగా రాణిస్తాయని స్పష్టం చేశారు. దీంతో రామ్ చరణ్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Charan's sensational comments on Mahesh Rajamouli's project in American show

ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆగస్టు నెలలో ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరోపక్క విజయేంద్రప్రసాద్ మహేష్ సినిమా స్క్రిప్ట్ వర్క్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో త్వరలో ఫినిషింగ్ టచ్ చేసి మే నెలలో…సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే నాడు రాజమౌళి మహేష్ మీడియా సమావేశం నిర్వహించి ..అధికారిక ప్రకటన చేయడానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో చరణ్ మాటలు బట్టి చూస్తే రాజమౌళి స్థాయి పాన్ ఇండియా లెవెల్ నుండి గ్లోబల్ సినిమా స్థాయికి పెరిగినట్లు తెలుస్తోంది.


Share

Related posts

అందరికీ రాజమౌళి ఆఫర్ ఇస్తుంటే .. ఈ హాట్ బ్యూటీ రాజమౌళి కె బంపర్ ఆఫర్ ఇచ్చింది.

GRK

Bhavani Sre Cute Looks

Gallery Desk

Nithiin: హీరో నితిన్‌కి ఈ రోజు వెరీ వెరీ స్పెష‌ల్‌.. ఎందుకో తెలుసా?

kavya N