‘ చీకటి గదిలో చితకొట్టుడు ‘ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఆదిత్ అరుణ్, నిక్కీ తంబోలి, భాగ్యశ్రీ మోటే, మిర్చి హేమంత్, తాగుబోతు రమేష్ ప్రధానపాత్రల్లో సంతోష్ పి. జయకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’.. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ లతో ప్రేక్షకుల్లో మంచి స్పందన తెచ్చుకున్న ఈ సినిమా మార్చి 21 విడుదల అవుతుంది. కాగా ఈ సినిమా కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగగా ఈ కార్యక్రమానికి చిత్ర బృందం హాజరైంది..
ఈ సందర్భంగా నటుడు తాగుబోతు రమేష్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించే అవకాశం నాకు వచ్చేలా చేసిన సత్యం రాజేష్ గారికి కృతజ్ఞతలు.. ఈ సినిమా తమిళ్లో పెద్ద హిట్ అయ్యింది. డైరెక్టర్ గారికి అక్కడ మంచి పేరొచ్చింది.. ఈ సినిమా లో నా పాత్ర చాల హిలేరియస్ గా నవ్విస్తుంది.. డబ్బింగ్ టైం లో నేను బాగా చేశానని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది.. ఇప్పటివరకు నేను 200 సినిమాలు చేశాను.. కానీ ఏ సినిమా కి ఇంత కష్టపడలేదు.. ఈ సినిమా తో మళ్ళీ నాకు బ్రేక్ వస్తుందని అనిపిస్తుంది.. నాకు తాగుబోతు పాత్రలేకాకుండా  వేరే పాత్రలు కూడా వస్తాయని నమ్మకంగా చెప్తున్నాను..రాజేష్ గారి కాంబినేషన్ లో చేసిన సీన్స్ అదిరిపోయాయి.. నన్ను నమ్మి ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శకనిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు..
నటుడు సత్యం రాజేష్ మాట్లాడుతూ.. చీకటి గదిలో చితకొట్టుడు సినిమా ప్యూర్ అడల్ట్ మూవీ.. తెలుగులో ఇంతవరకు ఈ టైప్ అఫ్ సినిమా రాలేదు. దర్శకుడు సంతోష్ నాకు మంచి మిత్రుడు.. సినిమా పట్ల మంచి ప్యాషన్ ఉన్న వ్యక్తి.. తమిళ్లో మంచి హిట్ అయిన సినిమా.. ఇక్కడ కూడా బాగా ఆడాలని కోరుకుంటున్న.. హీరో హీరోయిన్స్ చాల బాగా చేశారు.. కమెడియన్స్ ఇరగదీశారు.. నా పాత్ర చాల వెరైటీ గా ఉంటుంది.. ఈ సినిమా ని అందరు చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు..
హీరోయిన్ నిక్కీ తంబోలి మాట్లాడుతూ.. తెలుగులో ఇది నా మొదటి సినిమా.. ఈ చిత్రం లో నన్ను హీరోయిన్ గా ఎంచుకున్నందుకు చాల ఆనందంగా ఉంది.. మార్చి 21 న  హోలీ పండగ రోజు ఈ సినిమా రిలీజ్ అవుతుంది..  అందరు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.. మీ అందరికి ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను అన్నారు..
హీరో ఆదిత్ అరుణ్ మాట్లాడుతూ.. ఎవ్వరు చేయలేని స్క్రిప్ట్ లు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సబ్జెక్టు తో సినిమా చేస్తున్నాను..  కానీ ఈ సినిమా నాకు చాల బాగా నచ్చింది.. విన్నప్పుడు పడి పడి నవ్వాను.. ఈ సినిమా కి చీకట్లో చితకొట్టుడు టైటిల్ చాల బాగా యాప్ట్ అయ్యింది.. టైటిల్ వినగానే సినిమాలో ఏముందో తెలియాలి.. ఆ జస్టిఫికేషన్ ఈ టైటిల్ లో ఉంది.. తప్పకుండ ఈ సినిమా చితక్కొట్టే హిట్ అవుతుందని చెప్పగలను.. ఈ సినిమా 18 రోజుల్లో షూట్ చేశారు.. నిజంగా డైరెక్టర్ గారు చాల గ్రేట్.. అందరు చాల బాగా పనిచేశారు..ప్రొడ్యూసర్ గారు మంచి గట్స్ ఉన్న నిర్మాత.. జోనర్ ఏదైనా అందరు కడుపుబ్బా నవ్వుకునే సినిమా.. మార్చి 21 న హోలీ రోజు విడుదల అవుతుంది.. అందరు తప్పకుండా చూడండి  అన్నారు..
దర్శకుడు సంతోష్ పి. జయకుమార్ మాట్లాడుతూ.. తెలుగులో ఇది నాకు మొదటి సినిమా.. తమిళ్లో ఈ సినిమా చాల పెద్ద హిట్ అయ్యింది.. అదే కాన్ఫిడెన్స్ తో ఇక్కడ చేశాం.. తప్పకుండ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను.. అందరు చాలా కోఆపరేటివ్ గా పనిచేశారు.. అందుకే ఈ సినిమా ని ఇంత త్వరగా , బాగా తీశాం.. ఫ్యామిలీస్ ఈ సినిమా చూడొద్దు.. ఈ హోలీ సందర్భంగా సినిమా రిలీజ్ అవుతుంది.. మీ అందరిని తప్పకుండ నవ్విస్తుంది..అన్నారు..