RRR: “RRR” కోసం రంగంలోకి బాలయ్య బాబు, చిరంజీవి..??

Share

RRR: “బాహుబలి”(Bahubali) వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా RRR. బాహుబలి కంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా లో ఫస్ట్ టైమ్ రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్(NTR) నటిస్తూ ఉండటంతో ఓవరాల్ గా ఉన్న అంచనాల కంటే దక్షిణాదిలో డబుల్ త్రిబుల్ అంచనాలు “RRR” పై ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో అయితే ఈ సినిమా కోసం నందమూరి మెగా అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నారు.

RRR Movie: 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టులుగా చిరంజీవి,  బాలయ్య..!! | SS Rajamouli Invites Chiranjeevi and Balakrishna for RRR Movie  Pre Release Event | RRR Movie Updates

నందమూరి వర్సెస్ మెగా అభిమానులు అన్న తరహాలో ఒకప్పుడు వాతావరణం ఉండగా, అభిమానుల మధ్య సానుకూల వాతావరణం క్రియేట్ అయ్యే రీతిలో ఎన్టీఆర్(NTR), చరణ్(Charan) కలిసి నటించిన ఈ సినిమా విడుదల కోసం తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున స్టార్ట్ కావడం తెలిసిందే. సంక్రాంతి పండుగకు రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమం ముంబైలో నిర్వహించగా ముఖ్యఅతిథిగా సల్మాన్ ఖాన్(Salman Khan) రావడం జరిగింది.

Buzz: Chiranjeevi and Balakrishna coming for RRR?

భారీ ఎత్తున “RRR” ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఇదిలా ఉంటే దాన్ని తలదన్నేలా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రమోషన్ కార్యక్రమం RRR మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా.. బాలయ్య బాబు, చిరంజీవి రాబోతున్నారు అట. దీంతో ఒకే వేదికపై ఎన్టీఆర్, బాలయ్య బాబు చిరంజీవి వంటి స్టార్ పెద్ద హీరోలను కన్నుల విందుగా చూపించడానికి సినిమా మేకర్స్ ప్రమోషన్ ఏర్పాట్లు రెడీ చేస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ టాక్. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి ఏడవ తారీఖున రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. బాహుబలి కంటే భారీ రేంజ్లో హిట్ అవ్వాలని సినిమాల్లో ప్రతి ఫ్రేం విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. మరి వచ్చే ఏడాది RRR ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.


Share

Related posts

సమంత.. చైతూకు విడాకులు ఇవ్వు! మనం పెళ్లి చేసుకుందాం!

Teja

Karan johar : కరణ్ జోహర్ తో మరో సినిమా చేయబోతున్న జాన్వీ కపూర్

GRK

Keerthy Suresh Latest Gallerys

Gallery Desk